పవన్ కల్యాణ్ షూస్ ధర ఎంతో తెలుసా? ఏ కంపెనీ అంటే? సాయిధరమ్‌తో పవర్ స్టార్ బ్రో మూవీ పోస్టర్ ట్రెండింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం బ్రో (BRO:The Avatar). ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తాజా వివరాలు, అలాగే ఇటీవల రిలీజ్ చేసిన సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ లుక్, ఆ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ ధరించిన షూస్ ధర వివరాల్లోకి వెళితే...

పవన్ కల్యాణ్ నటిస్తున్న బ్రో సినిమా టైటిల్‌ను, మోషన్ పోస్టర్‌ను మే 18వ తేదీన రిలీజ్ చేయగా భారీ స్పందన లభించింది. మోషన్ పోస్టర్‌లో కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం అనే శ్లోకంతో పవన్ కళ్యాణ్ లుక్‌ను పరిచయం చేయడం వైరల్ అయింది.

బ్రో సినిమా టైటిల్ ప్రకటన తర్వాత ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలోనే మే 23 తేదీన సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మార్క్ అలియాస్ మార్కండేయులు పాత్రను పరిచయం చేశారు. ఆ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు కూడా విశేష స్పందన లభించింది. బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం అనే శ్లోకంతో శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో ఆయన పాత్రను పరిచయం చేయడం ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకొన్నది.

ఇదిలా ఉండగా, బ్రో ద్వయం పేరుతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఉన్న పోస్టర్‌ను మే 29న ఉదయం 10:08 గంటలకు విడుదల చేశారు. బైక్ మీద ఒక కాలు పెట్టి పవన్ కళ్యాణ్ నిల్చొని ఉండగా, ఆయన మోకాలిపై చేతులు ఉంచి సాయి ధరమ్ తేజ్ నిల్చొని ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ చేతులపై పవన్ కళ్యాణ్ చేయి ఉండటం చూస్తుంటే నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్లుగా ఉంది.
పవన్ కళ్యాణ్ కంటిచూపుతోనే దేన్నైనా శాసించగలరనే అంతలా శక్తివంతంగా కనిపించారు. సాయి ధరమ్ తేజ్ ముఖంలో మాత్రం సున్నితత్వం ఉట్టిపడుతున్నది. ఓవరాల్‌గా పవన్, సాయిధరమ్ తేజ్ పోస్టర్ వైరల్‌గా మారింది. బ్రో (BRO) సినిమాli జులై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న పోస్టర్ వైరల్ కాగా.. అందులో పవర్ స్టార్ ధరించిన షూస్ గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ ధరించిన షూస్ బాల్ మెయిన్ యూనికర్న్ (Balmain Unicorn) కంపెనీకి చెందినవి కావడం విశేషంగా మారింది. నియోప్రేన్, లెదర్ మెటీరియల్‌తో షూట్ తయారు చేసినట్టు కంపెనీ స్పెసిఫికేషన్‌లో స్పష్టమైంది.

బాల్ మెయిన్ యూనికర్న్ (Balmain Unicorn) షూస్ వివరాల్లోకి వెళితే.. 82 శాతం నైలాన్, 14 శాతం ఎలస్టాన్, 4 శాతం థెర్మో ప్లాస్టిక్ పాలీయూరెథాన్ మెటీరియల్‌లో తయారు చేయబడ్డాయి. బ్లాక్ నేయిర్ కలర్‌తో చేయబడ్ాయి. హీల్ ఎత్తు 1 సెంటీ మీటర్‌గా పేర్కొన్నారు. దీని ఖరీదు 1207 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో ₹1,06,870 అని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











