twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ కోవిడ్ సెంటర్లో మహేష్ బాబు సాంగ్.. ఉల్లాసంగా కాలు కదిపిన కరోనా పేషంట్లు!

    |

    తెలుగువారికి సినిమాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. కరోనా మొదటి వేవ్ టెన్షన్ అయిపోయాక మిగతా ఇండస్ట్రీల వాళ్ళు అసలు అందరూ థియేటర్లు ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న తరుణంలో తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కాస్త ధైర్యం చేసుకుని థియేటర్లు ఓపెన్ చేశారు. అంతే మీకు అండగా మేము ఉన్నామని నిలబడిన తెలుగు ప్రేక్షకులు దాదాపు మూడు నాలుగు సినిమాలను సూపర్ హిట్స్ గా నిలిపారు. ఒక రకంగా తెలుగువారి జీవితంలో సినిమా ఒక భాగం అయిపోయినట్లే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో సినిమా డైలాగులు, పాటలు ప్రస్తావిస్తూనే ఉంటారు..

    అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో సైతం భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి.. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కరోనా కేర్ సెంటర్లు ఏర్పరిచి కరోనా సోకి, లక్షణాలు తక్కువగా ఉన్న వారిని ఐసోలేషన్లో ఉంచి వారిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. తాజాగా అలాంటి ఒక సెంటర్లో కరోనా పేషెంట్ల మెంటల్ స్ట్రెస్ అలాగే యాంగ్జయిటీ తగ్గించేందుకు గానూ ఒక స్పెషల్ మ్యూజిక్ సెషన్ నిర్వహించారు..

    Covid Patients dancing for mahesh song at Guntur Covid Care Centre

    ఆ సెషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలోని కొన్ని పాటలను ప్లే చేస్తూ కరోనా పేషెంట్లు చేత ఎక్సర్సైజ్ చేయిస్తూ ఈ పాటకు అనుగుణంగా కాళ్లు కదిపేలా ప్రోత్సహించారు. ప్రస్తుతానికి ఈ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమకు కరోనా సోకింది అన్న బాధ కలగనివ్వకుండా వాళ్లలో సంతోషాన్ని నింపుతూ కరోనాతో పోరాడి బయటపడగలము అనే ధైర్యం నింపేందుకు ఇలా వారిచేత చేయిస్తున్నామని అక్కడి వైద్య అధికారులు చెబుతున్నారు.. మొత్తం మీద మహేష్ బాబు పాటలు ఇలా వాడుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

    English summary
    A video went viral showing Covid patients dancing to Mahesh babu songs. The incident was reported from Guntur, AndhraPradesh. In the viral video, Patients were seen dancing with soicial distance. Docters say Dancing to they are making this to beat mentalstress and anxiety.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X