ఓ మాటతో ప్రశంస.. ముఖంపై చిరునవ్వు చాలు.. మహేష్‌బాబుకు డీజీపీ ప్రశంసలు

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో తన తోటి నటీనటులతోపాటు సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన వంతు సామాజిక బాధ్యతగా స్పందిస్తున్నారు. ప్రజలకు, అభిమానులకు రక్షణ చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని సోషల్ మీడియాలో మహేష్‌ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ పోలీసులు తీసుకొంటున్న చర్యలను, ప్రజల పట్ల వారి చిత్తశుద్దిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు.

ప్రాణాంతక వైరస్ కోవిడ్19‌పై తమ శక్తికి మంచి పోరాటం చేస్తున్న తెలంగాణ పోలీసు దళాలను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను. విధి నిర్వాహణలో వారు చూపిస్తున్న చొరవ, అంకితభావాన్ని ఈ సమయంలో ప్రశంసించలేకుండా ఉండలేకపోతున్నాను అని మహేష్‌బాబు అన్నారు.

 Covid19: Telangana DGP Thanks tweets to Mahesh babu

తెలంగాణ పోలీసులపై మహేష్ బాబు గుప్పించిన ప్రశంసలు మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులకు ఆయన కామెంట్లు మరింత మానసిక ధైర్యాన్ని నింపాయి. ఈ క్రమంలో తమకు మానసిక స్థైర్యాన్ని అందించిన మహేష్‌కు తెలంగాణ తెలంగాణ పోలీసుశాఖ డీజీపీ ధన్యవాదాలు తెలిపింది.

మహేష్‌బాబు ట్వీట్‌పై డీజీపీ తెలంగాణ పోలీసుశాఖ స్పందిస్తూ.. సమాజంలో నెలకొన్న ఇలాంటి సంక్షోభ సమయంలో నైతిక మద్దతును ప్రకటించిన మహేష్‌కు థ్యాంక్స్. ఆపద సమయంలో సమాజానికి సేవ చేసే అవకాశం రావడం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. మా సేవలకు ఓ మాట రూపంలో ప్రశంసలు, ముఖంపై ఓ చిరునవ్వు చిందిస్తే చాలు. ఇలాంటి ముప్పును నివారించడానికి కొండంత బలంగా ఉంటుంది. కరోనాపై పైచేయి సాధిస్తామనే విశ్వాసం ఉంది అంటూ హేష్ ట్విట్టర్‌కు రిప్లై ఇచ్చారు.

మమ్మల్ని, మా సేవలను ప్రోత్సాహిస్తూ చేసిన మీ మాటలు మాకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చాయి. కొవిడ్19పై పోరాట సమయంలో మా సేవలకు మంచి గుర్తింపుగా భావిస్తున్నాం అని ఐజీ, ఉమెన్ సేఫ్టి స్వాతి లక్రా ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X