Bigg Boss Telugu 5 ఒక బ్రోతల్ షో.. నాగార్జునపై సీపీఐ నారాయణ ఫైర్

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ఎంతగా ప్రేక్షకులు ఆకట్టుకుంటుందో? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాత్రి పదయితే చాలు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ టీవీ ముందే ఉండి మరీ ఆసాంతం చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ ప్రోగ్రాం మీద సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో ఒక బ్రోతల్ షో అని కామెంట్ చేసిన ఆయన పరుష పదజాలంతో షో మీద విరుచుకు పడ్డారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఒక బ్రోతల్ షో

ఒక బ్రోతల్ షో

దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి బిగ్ బాస్ షో ప్రసారం అవుతున్న సమయంలో సిపిఐ నారాయణ షో మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బిగ్ బాస్ ప్రోగ్రాం ఒక బ్రోతల్ షో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు, ఈ షో ఒక క్యాన్సర్ లాంటిదని పేర్కొన్న ఆయన నైతిక విలువలు దెబ్బతినేలా పిల్లల బుర్ర పాడు అయ్యేలా ఈ షో ఉందని కామెంట్ చేశారు. అసలు బయట నేరాలు పెరగడానికి ఇలాంటి షోలే కారణమవుతున్నాయని, బయటికి అన్ని బూతులు కనిపిస్తున్నాయి, కనిపించకుండా ఇంకా ఏం జరుగుతుందో అని ఆయన ప్రశ్నించారు.

బిగ్ బాస్ మీద పోరాడి తీరుతా

బిగ్ బాస్ మీద పోరాడి తీరుతా

ఇక బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ విషయం మీద ఆలోచించాలని ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఎలాంటి గొప్ప సినిమాలు చేశారు? నాగార్జున ఆ పేరు నిలబెట్టకుండా ఇలాంటి చెత్త షోలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కూల్ డ్రింక్స్ ప్రకటనలలో నటించవద్దని గతంలో చిరంజీవికి చెబితే మానేశారు అని, మీరు కూడా ఇలాంటి షోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు వరకు వెళ్తామని పేర్కొన్న ఆయన బిగ్ బాస్ మీద పోరాడి తీరుతాం అని అన్నారు.

ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?

ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?

ఇక ఈ బిగ్ బాస్ పైన నేను చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నానని పేర్కొన్న ఆయన, కోర్టులు నేను వేసిన పిటిషన్ ను పెండింగ్ లో పెడుతున్నాయని అన్నారు. బిగ్ బాస్ లో 105 రోజులు యువతీ యువకులను ఒక గది లో పెడుతున్నారని, లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అని ప్రశ్నించారు.

తక్షణమే బ్యాన్ చేయాలి

తక్షణమే బ్యాన్ చేయాలి

ఇక బిగ్ బాస్ కి ఛాలెంజ్ 24 గంటలు లైవ్ పెట్టగలరా? అని ప్రశ్నించిన ఆయన బిగ్ బాస్ ఒక బ్రోతల్ స్వర్గం అని, రెడ్ లైట్ ఏరియా సంస్కృతి ని తీసుకువస్తున్నారని, అన్నారు దీనికి నాగార్జున హోస్టుగా ఉన్నారు, దీని వల్ల సమాజానికి ఎం చెబుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఇక ఒకరితో ముద్దు పెట్టుకొని మరొకరితో డేటింగ్ చేస్తున్నారన్నా ఆయన ఇది సాంస్కృతిక దోపిడీ..దీనిని తక్షణమే బ్యాన్ చేయాలని అన్నారు. దీనిపై మరోసారి కోర్టుకు వెళ్తానని షో నిలిచే దాకా పోరాడుతానని అన్నారు.

ఎలిమినేషన్స్

ఎలిమినేషన్స్

ఇక బిగ్ బాస్ షో ఇప్పటికే ఒక వారం విజయవంతంగా పూర్తి కాగా రెండో వారంలో కూడా మూడో రోజుకు చేరింది. ఇక ఈ వారానికి గాను దాదాపు ఏడుగురు హౌస్ సభ్యులను నామినేట్ చేశారు. వారిలో ఒకరు ఈ ఆదివారం నాడు ఎలిమినేట్ కానున్నారు. ప్రస్తుతానికి నట్రాజ్ మాస్టర్, ఉమా, లోబో, కాజల్, ప్రియా, ప్రియాంక సింగ్, అన్నీ మాస్టర్ నామినేషన్స్ లో ఉన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X