డార్లింగ్ డబుల్ బొనాంజా .. 15 రోజుల గ్యాప్‌లోనే రెండు రిలీజులు
ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ బిజీ అండ్ మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. కాగా ప్రభాస్ కి ఒక్క తెలుగులోనే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా క్రేజ్ నెలకొంది. తనతో సినిమాలు చేయాలని ప్రతి ఇండస్ట్రీలోని నిర్మాత కూడా కోరుకుంటున్నాడు. ఇలా పలు సినిమాలతో భారీ లైనప్ ని సెట్ చేసుకున్న రెబల్ స్టార్ నుంచి ఊహించని ట్రీట్ రాబోతుంది.
ఒకప్పుడు ప్రభాస్ నుంచి ఒక సినిమా రావాలి అంటే అది తన ఫాన్స్ కి అగ్ని పరీక్షలా నిలిచేది అని చెప్పాలి. ఎందుకంటే మిర్చి సినిమా నుంచి బాహుబలి రావడానికి మూడేళ్లు. బాహుబలి 1 నుంచి బాహుబలి 2 రావడానికి మూడేళ్ళు. బాహుబలి 2 నుంచి సాహో రావడానికి మరో రెండేళ్లు . ఇలా అక్కడ నుంచి ఒక్కో సినిమాకి ఎలా లేదన్నా రెండు మూడేళ్లు అయ్యిపోయేది. దీనితో ఫ్యాన్స్ ఆవేదన చూసి ప్రభాస్ స్వయంగా ఏడాదికి ఒకటి కాదు రెండు రిలీజ్‌లు అందిస్తానని ప్రామిస్ చేశారు. నాటి నుంచి ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేసాడు.

అలా గత ఏడాదిలో ఆదిపురుష్ , సలార్ సినిమాలు అందించగా ఈ ఏడాదిలో ఒక సినిమా ఇచ్చాడు. అయితే వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ నుంచి మొత్తం మూడు సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. మూడింట్లో అయితే రెండు సినిమాలు ఏకంగా ఒకే నెలలో రాబోతున్నాయనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇది మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ ఫీస్ట్ అని చెప్పాల్సిందే.
ఒకే నెలలో వచ్చే ఆ రెండు కొత్త సినిమాలు ఏవంటే దర్శకుడు మారుతీతో చేస్తున్న హారర్ అండ్ భారీ విజువల్ ఎంటర్టైనర్ "ది రాజా సాబ్" . ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇదే ఏప్రిల్ లో ప్రభాస్ నటిస్తున్న రెండో సినిమా రాబోతుంది. అయితే ఇది ప్రభాస్ హీరోగా చేసింది కాదు కానీ తాను పవర్ఫుల్ క్యామియో చేసిన "కన్నప్ప" సినిమా.

కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ నిజానికి ఈ డిసెంబర్ లో ప్లాన్ చేశారు కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఇపుడు ఈ సినిమాను థియేటర్స్ లో ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే కేవలం 15 రోజుల్లోనే ప్రభాస్ నుంచి రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి అని చెప్పాలి. దీంతో కేవలం ఒకే నెలలో ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా అని చెప్పాల్సిందే.
ఆల్రెడీ విష్ణు మంచు నటిస్తున్న ఈ కన్నప్పలో ప్రభాస్ క్యామియోపై సాలిడ్ హైప్ నెలకొంది. ఇక ఇపుడు ఒకే నెలలో రెండు సినిమాలు అంటే ఫ్యాన్స్ చాలా లక్కీ అని చెప్పాల్సిందే. కాగా ఈ కన్నప్ప చిత్రాన్ని హిందీలో సెన్సేషనల్ హిట్ సీరియల్ మహాభారతం తీసిన దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. అందుకే దీనిపై మరింత హైప్ ఉంది.


Click it and Unblock the Notifications











