Oscars 2023 నాటు నాటు పాటపై క్రికెట్ దిగ్గజం స్టెప్పులు.. RRR మూవీకి అవార్డు రావడంతో క్రికెట్ మైదానంలో..
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు, ప్రేక్షకులకు ఆస్కార్ ఫీవర్ పట్టుకొన్నది. ప్రపంచ సినిమా వేదికపై తెలుగు పాట నాటు నాటు సత్తా చాటడంతో అభిమానులు ఆనందాన్ని ఇతరులతో షేర్ చేసుకొంటున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం ఆస్కార్ అవార్డుల వేడుకలో అవార్డు సంపాదించడంతో ప్రపంచస్థాయి తెలుగు అభిమానులు సంబరాలు చేసుకొంటున్నారు. కేవలం ఈ సినిమా తెలుగు వాళ్లనే కాకుండా ఉత్తర, దక్షిణ భారతం, అలాగే ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలో నాటు నాటు సినిమా ఆస్కార్ అవార్డు సాధించడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆ పాటకు స్టెప్పులేసి ఏమన్నారంటే?
ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా జరుగుతున్న కామెంటరీలో క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ RRR అవార్డు గెలుచుకొన్న ప్రస్తావన తెచ్చారు. దాంతో కామెంటరీ నిపుణులు సునీల్ గవాస్కర్ మాట్లాడించి స్టెప్పులేయించారు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. RRR సినిమాకు అవార్డు వస్తుందని భావించాను. నేను అనుకొన్నట్టుగానే అవార్డు వచ్చింది. నాటు నాటు పాటను ప్రపంచంలోని అన్ని వర్గాలను ఆలరించే విధంగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్స్‌కు అభినందనలు. RRR చిత్రం అద్బుతంగా ఉంది. నేను కూడా ఆ సినిమాను చూశాను అని సునీల్ గవాస్కర్ చెప్పారు.

RRR సినిమాతో ప్రారంభమైన అవార్డుల పంట.. ఇక ముందు కూడా భారీగా కొనసాగాలని సునీల్ గవాస్కర్ ఆకాంక్షించారు. ఆ తర్వాత నాటు నాటు పాటకు అనుగుణంగా గవాస్కర్ స్టెప్పులేసి తన ఆనందాన్ని కామెంటరీ నిపుణులతో పంచుకొన్నారు. చాలా హుషారుగా ఆ పాటకు డ్యాన్స్ చేసి సంతోషంలో మునిగిపోయారు.
ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో సినిమా పాటలు ప్లే చేస్తారు. చాలా మంది క్రికెటర్లు తమ మ్యూజిక్ సిస్టమ్‌లో పాటలు పెట్టుకొని జోష్‌తో ముందుకు వస్తుంటారు. నాటు నాటు పాటను కూడా ఇండియన్ డ్రెస్పింగ్ రూమ్‌లో ప్లే చేస్తే.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మంచి ఫలితం సాధించే అవకాశం ఉంటుందని సునీల్ గవాస్కర్ అన్నారు. ఆ తర్వాత ఇద్దరు కామెంటేటర్లతో కలిసి సునీల్ గవాస్కర్ స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











