క్రికెటర్‌కు దిమ్మ తిరిగేలా చేసిన త్రిష చిత్రం.. వాట్ ఎ మూవీ అంటూ ట్వీట్!
యువ క్రికెటర్ దినేష్ కార్తిక్ '96' చిత్రానికి ఫిదా అయ్యాడు. బ్యాట్స్మన్ కమ్ వికెట్ కీపర్ అయిన దినేష్ కార్తీక్ ఈ చిత్రం తెగ నచ్చేసిందట. త్రిష, విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారని ట్వీట్ చేశాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ మూవీ 96.. చాలా బాగా నచ్చింది. చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంలోని 'కాదలే' అనే పాటకు ఫిదా అయ్యానని డీకే తెలిపాడు.
ఈ చిత్రంతో విజయ్ సేతుపతికి అభిమానిగా మారిపోయా. మొత్తంగా 96 చిత్రం దిమ్మతిరిగేలా చేసింది అని డీకే ట్వీట్ చేశాడు. మరి కొందరి క్రికెటర్స్ పేర్లు జత చేస్తూ.. వాషింగ్టన్ సుందర్, అభినవ్ ముకుంద్ కూడా ఈ చిత్రానికి అభిమానులుగా మారిపోయారని తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్ మరి నీ సంగతేంటి అంటూ ట్వీట్ చేశాడు.

ప్రేమ్ కుమార్ దర్శత్వంలో వచ్చిన 96 చిత్రం 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రం కోసం జనాలు ఎగబడుతున్నారు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.


Click it and Unblock the Notifications











