Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
వెండితెరపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. విక్రమ్‌ను ఢీకొట్టేందుకు రెడీ
ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ వెండితెర మీద నటుడిగా మారబోతున్నారు. చియాన్ విక్రమ్ నటిస్తున్న కోబ్రా చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి లాక్‌డౌన్‌కు ముందే షూటింగు జరగాల్సింది. అయితే కరోనా కారణంగా నిరవధికంగా షూటింగ్ వాయిదా పడింది. అజయ్ జానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగు మాస్కోలో జరుగుతున్నది. ఆ షూటింగుకు సంబంధించిన ఫోటోను ఇర్ఫాన్ పఠాన్ షేర్ చేయడం అది వైరల్ అయింది.
రష్యాలోని ఎక్కడో ఓ అందమైన ప్రదేశం ఇది అంటూ ఇర్ఫాన్ పఠాన్ అంటూ తన ఫోటోను షేర్ చేశారు. ఓ అందమైన భవనం ముందు నిలుచొన్నాడు. విపరీతమైన మంచు కురుస్తుండగా చలికి తట్టుకొనే దుస్తులను ధరించి ఫోటోకు ఫోజిచ్చారు.

కోబ్రా చిత్రంలో విక్రమ్ సరసన కేజీఎఫ్: చాప్టర్ 1 ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అస్లాన్ యిల్మాజ్ అనే ఇంటర్‌పోల్ అధికారి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ ప్రధాన విలన్‌గా కనిపించనున్నారు.