Ind Vs Pak: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను కెలికిన స్టార్ క్రికెటర్.. ఇండియా, పాక్ మ్యాచ్ సమయంలో అలాంటి పోస్ట్!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రేంజ్ ఏ లెవెల్ కి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా మన తెలుగు సినిమా ఈ రేంజ్ కి వెళ్ళడానికి గల ప్రధాన కారణాల్లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి టాప్ లో ఉంటారని చెప్పవచ్చు. తన సినిమాలు మూలానే మరిన్ని వరల్డ్ క్లాస్ సినిమాలు, మెయిన్ గా పాన్ ఇండియా మార్కెట్ సినిమాలు వస్తున్నాయి.
కాగా ఇలా రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ ఫినామినా సినిమా ఆర్ ఆర్ ఆర్ కోసం అయితే ప్రపంచమే మాట్లాడింది. ఒక రకంగా ఈ చిత్రానికి వచ్చిన గ్లోబల్ ఫేమ్ తో హీరోలు రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లు ఇంకా రాజమౌళి కూడా గ్లోబల్ ఐకాన్స్ అయ్యారు. సరే ఈ సినిమా సక్సెస్ లో సింహ భాగం దర్శకునికే చెందుతుంది కానీ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ కొట్టుకుంటున్నారు.

ఎవరి పర్శనల్ థాట్స్ వారికి ఉంటాయి కానీ జెన్యూన్ గా ఈ సినిమాని చూసిన న్యూట్రల్ ఆడియెన్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఒకింత చరణ్ వైపే మొగ్గు చూపారు. సినిమాలో రామ్ చరణ్ పాత్రే పెద్దది భీమ్ కూడా అన్న అనే పిలుస్తాడు కాబట్టి ఆ సినిమాలో మెయిన్ లీడ్ రామ్ చరణ్ గానే చాలా మంది భావించారు. అయితే ఇది సినిమా రిలీజ్ రోజే తేలింది.
చాలా మంది తారక్ అభిమానులు రాజమౌళిని తిట్టుకున్నారు కూడా.. కాగా ఇది మాత్రం అక్కడ నుంచి ఇరు హీరోల ఫ్యాన్స్ నడుమ ఇప్పటికీ గొడవల్లా కొనసాగుతూనే వస్తుండగా లేటెస్ట్ గా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మ్యాచ్ కి సంబంధించి భారత ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో పెట్టుకున్న ఓ లేటెస్ట్ వీడియో థంబ్ నైల్ సోషల్ మీడియాలో చర్చగా మారింది.
భారత్, పాకిస్తాన్ జట్ల కెప్టెన్ లు తమ వెనుక ఇద్దరు ప్లేయర్స్ ఉంటే వారికి రోహిత్ శర్మ వెనుక RRR నుంచి రామ్ చరణ్ పిక్ కి గాను అశ్విన్ తన ఫోటో మార్ఫ్ చేసి పెట్టుకుంటే పాకిస్తాన్ ప్లేయర్ కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ది తన ఛానెల్లో సెటప్ చేసి రిలీజ్ చేశారు. దీనితో ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
మెయిన్ లీడ్ రామ్ చరణ్ కాబట్టి అశ్విన్ తనని రామ్ చరణ్ కి పెట్టుకున్నాడని ఎన్టీఆర్ ని పాకిస్తాన్ టీం వ్యక్తికి సెట్ చేసాడని ఇప్పుడుకైనా సినిమాలో మెయిన్ హీరో ఎవరో తెలుసుకోవాలి అంటూ చరణ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రిగ్గర్ చేస్తున్నారు. ఇక ఇదొక కారణం అయితే పాకిస్తాన్ ప్లేయర్ ని ఎన్టీఆర్ బాడీకి పెట్టడం ఏంటని ఈ విషయంలో కూడా తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఇలా రవిచంద్రన్ అశ్విన్ ఫ్యాన్స్ ని కెలుక్కొని సోషల్ మీడియాలో చర్చకి దారి తీసాడు.


Click it and Unblock the Notifications











