'ఆదిపురుష్'పై స్టార్ క్రికెటర్ ఊహించని కామెంట్స్.. బాహుబలి కట్టప్పను లాగి మరి సెటైర్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలై 9 రోజులు కావొస్తున్న విమర్శలు, సెటైర్లు ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమా మహాకావ్యం రామాయణ కథాంశంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ఓ మాట, తర్వాత మరో మాట చెబుతూ మేకర్స్ నెట్టుకొస్తున్న నెగెటివిటీ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటుంది. ఇది వరకు ఇండియన్ సినిమాలో అనేకమైన రామాయణ గాథలను ఆవిష్కరించగా.. ఆదిపురుష్ మాత్రం ఎనలేని అపకీర్తి మూటగట్టుకుంది. రాజకీయ నేతలు, హిందూ సేనలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న వేళ తాజాగా మాజీ స్టార్ టీమిండియా క్రికెటర్ ఊహించని విధంగా సెటైర్లు వేశారు.

రామాయణం కథ ఆధారంగా రూపొందిన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో రావణాసూరిడిగా సైఫ్ అలీ ఖాన్, సీతాదేవిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్, హనుమంతుడిగా మరాఠీ పాపులర్ నటుడు దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు. సోనాల్ చౌహన్, తేజస్విని పండిట్, వత్సల్ సేథ్ నటించారు. టీ సిరీస్ సంస్థ నిర్మాణంలో భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ప్రసాద్ సుతారియా, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, ఓం రావత్ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఆదిపురుష్ సినిమాను తానాజీ వంటి హిట్ ఇచ్చిన హిందీ దర్శకుడు ఓం రావత్ డైరెక్ట్ చేశారు. ఇక ఆది నుంచే సినిమా, దర్శకుడిపై బీభత్సమైన విమర్శలు వెల్లువెత్తాయి. మూవీ విడుదల తర్వాత అంటే జూన్ 16 నుంచి ఈ నెగెటివిటీ మరింత తీవ్రతరం అయింది. రాజకీయ నేతలు, ప్రేక్షకులు ఒక్కరేంటీ రామయణం తెలిసిన సగటు వ్యక్తి ఆదిపురుష్ సినిమాను విమర్శిస్తున్నాడు. ఈ సినిమాను థియేటర్, ఓటీటీలో బ్యాన్ చేయాలని డిమాండ్స్ కూడా వచ్చాయి.

ఇక తాజాగా ఆదిపురుష్ సినిమాపై టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఊహించని రేంజ్ లో సెటైర్లు వేశారు. సాధారణంగా పలు అంశాలపై సెహ్వాగ్ తన స్టైల్ లో విమర్శలు, కౌంటర్లు, సెటైర్లు వేస్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల ఆదిపురుష్ సినిమా చూసిన ఆయన ప్రభాస్-రాజమౌళి సూపర్ హిట్ కాంబో బాహుబలి సినిమాతో లింక్ చేస్తూ చమత్కారపు అస్త్రం సంధించారు. "ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది" అని నవ్వుతున్న ఎమోజీతో ట్వీట్ చేశారు సెహ్వాగ్. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారగా.. ప్రభాస్ ఫ్యాన్స్ సెహ్వాగ్ పై ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











