వెండితెరపై హర్బజన్ సింగ్ జీవిత కథ.. బయోపిక్‌కు సన్నాహాలు!
దేశవ్యాప్తంగా పలు సినీ రంగాల్లో సినీ ప్రముఖులు, క్రికెటర్లు, రాజకీయ నేతలు, ఇతర రంగాల్లోని సెలబ్రీటల జీవితాల ఆధారంగా బయోపిక్స్ రూపొందడమే కాకుండా భారీగా ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నది. ముఖ్యంగా క్రీడారంగంలో మేరీ కోమ్, దంగల్, భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని లాంటి బయోపిక్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
అయితే క్రికెట్ గ్రౌండ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌ను బెంబేలెత్తించిన హర్భజన్ సింగ్ జీవితంపై బయోపిక్ రూపొందించే విషయంపై చర్చ జరుగుతున్నది.ప్రస్తుతం భజ్జీ మాత్రం తన బయోపిక్‌పై సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, క్రికెట్ నేపథ్యంగా కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా 83 చిత్రం రూపొందుతుండగా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో తాప్సీ పన్ను హీరోయిన్‌గా రష్మి రాకెట్ తెరకెక్కుతున్నది. ఇలాంటి నేపథ్యంలో హర్బజన్ సింగ్ బయోపిక్ విషయం ఆసక్తిగా మారింది.
క్రికెటర్ హర్పజన్ సింగ్ ఇటీవలే ఫ్రెండ్‌షిప్ చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యారు.


Click it and Unblock the Notifications











