Dunki Critic Review షారుక్ అలా షాక్ ఇవ్వడం గ్యారెంటీ.. క్రిటిక్ రివ్యూ ఎలా ఉందంటే?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పాపులర్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం డంకి (Dunki). తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, వికీ కౌశల్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచింది. ఈ క్రమంలో దుబాయ్‌లో క్రిటిక్‌గా చెప్పుకొనే నెటిజన్ తన రివ్యూను ఇస్తూ..
డంకీ ఎమోషనల్ కంటెంట్‌తో కూడిన మూవీ. వినోదాన్ని అందిస్తూనే సమాజం పట్ల ఆలోచనను రేకెస్తిస్తుంది. యువతకు స్పూర్తిని రగిలించే సినిమాలో భారీగా ఫీల్ గుడ్ అంశాలు ఉంటాయి. షారుక్ ఖాన్ గతంలో నటించిన సినిమాలను, విజయాలను మరిచిపోయేలా ఈ మూవీ చేస్తుంది. హార్డీ పాత్రలో అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో మిమ్మల్ని ఆకట్టుకొంటాడు అని ఉమేర్ సంధూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

డంకీ సినిమా గురించి ఎక్కువగా చెప్పుకుండా ఒక్కమాటలో చెప్పాలని అనుకొంటున్నాను. ఆల్ ఈజ్ వెరీ వెరీ వెరీ వెల్ అనే విధంగా ఉంటుంది. ఆల్ ఈజ్ వెల్ కంటే బెటర్ ఎలా ఉంటుందో అనే విషయాన్ని చూడాలంటే.. షారుక్ ఖాన్‌తో కలిసి దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి బిగ్ బ్యాంగ్‌తో మళ్లీ వచ్చాడనే ఫీలింగ్ కలుగుతుంది. 2023 సంవత్సరంలో ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పగలను అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.

డంకీ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుంది. షారుక్ ఖాన్ ఫెర్ఫార్మెన్స్, రాజ్ కుమార్ హిర్వాణి టేకింగ్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్రిటిక్ నోళ్లను తప్పకుండా మూయిస్తుంది అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.

ఇక షారుక్ ఖాన్ విషయానికి వస్తే.. వరుస పరాజయాలతో దాదాపు 3 ఏళ్లకుపైగా బాలీవుడ్‌కు దూరమైన ఆయన 2023లో ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకొన్నారు. పఠాన్, జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ఒకే ఏడాదిలో మూడో సినిమాలతో హిట్స్ ఇచ్చి బాలీవుడ్‌కు కొత్త ఉత్తేజం తెచ్చాడు. ఈ క్రమంలో డంకీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











