Sita Ramam: సినిమాకు అదే సోల్.. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అదుర్స్… అంచనాలు పెంచేస్తున్న రివ్యూ!
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం సీతారామం. బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఏసినిమాలో తెలుగు హీరో సుమంత్, హీరోయిన్ రష్మిక మందన కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా రివ్యూలు బయటకు వస్తున్నాయి. ఆ వివరాలు

హృదయానికి హత్తుకునే
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సినిమా సీతారామం. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకోగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమా మీద అంచనాలను భారీగా పెంచే విధంగా మారింది. ఎందుకంటే డైరెక్ట్ ప్రభాస్ ఈవెంట్ కు హాజరు కావడమే కాక హను రాఘవపూడి మరో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో వస్తున్నాడని చెప్పడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.

సోషల్ మీడియా ద్వారా
దానికి తగ్గట్టు ఈ సినిమా గురించి అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఐతో పాటు టెక్నికల్ విభాగం హెడ్ అయిన సీవీ రావు చేసిన పోస్టు కూడా సీతారామంపై అంచనాలు భారీగా పెంచింది. ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పీరియడ్ సినిమాల్లో సీతారామం బెస్ట్ అని సీవీ రావు తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇక దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకుంటూ ఉండే ఉమైర్ సంధూ ఈ సినిమా చూసి తన రివ్యూ ఇచ్చారు.

టాప్ నాచ్
ఓవర్సీస్ సెన్సార్ నుండి సీతారామం ఫస్ట్ రివ్యూ అంటూ పేర్కొన్న ఉమైర్ సంధూ 2022 ఉత్తమ తెలుగు చిత్రాల్లో ఇది ఒకటని అన్నారు. ఆకర్షణీయమైన క్షణాలతో ఒక అందమైన కథ ఇదని ఆయన పేర్కొన్నారు. దులర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అన్నారు. ఇక సినిమాకు సంగీతం అలాగే క్లైమాక్స్ సోల్ గా నిలుస్తాయని, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెబుతూ మూడున్నర రేటింగ్ కూడా ఇచ్చారు.
ఆగష్ట్ 5న థియేటర్లలో
వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈసినిమాలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సుమంత్, రష్మిక ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగష్ట్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











