Eagle Pre Release Event రవితేజ లైఫ్, స్పెషల్ డైలాగ్‌లన్నీ ఒక్క పాటలోనే.. పాడిందెవరంటే?
మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం రోజు వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా రవితేజ బయోగ్రఫీతో పాటు ఆయన సినిమాల్లోనూ సూపర్ హిట్ డైలాగ్ లన్నింటినీ ఒకే దాంట్లో చెప్పేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
రవితేజ హీరోగా రాబోతున్న ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ వంటి వాళ్లంతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సోలోగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. అయితే తాజాగా ఈ రోజు సినిమా ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.

ఈ ఈవెంట్ లో స్పెషల్ గా ఓ పర్ఫార్మెన్స్ నిలిచింది. వైజాగ్ కు చెందిన ఓ అబ్బాయిని.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కుర్రాడిని తీసుకు వచ్చి ర్యాప్ సాంగ్ పాడించారు. ముఖ్యంగా C Shore పేరుతో నెట్టింట సూపర్ ర్యాప్ సాంగ్స్ పాడే అతడు ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజీ ఎక్కి మరీ రవితేజ గురించి ఓ స్పెషల్ సాంగ్ పాడాడు. ముఖ్యంగా రవితేజ గారు మాస్ మహారాజా ఎలా మారారో వివరించారు. భూపతి రవిశంకర్ రాజు.. మాస్ మహారాజా రవితేజ ఎలా అయ్యాడో చాలా చక్కగా వివరించాడు. ఒక్క పాట ద్వారానే రవితేజ కెరియర్ ను చూపించారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని డైలాగ్ లను కూడా వినిపించారు.
మనలాగే ఓ అబ్బాయి.. మనలాగే మిడిల్ క్లాస్.. సినిమా అంటే పిచ్చి.. టాలెంట్ ఏమో ఎక్కువ అంటూ స్టార్ట్ చేశాడు. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అతను.. అతని పేరమే రవిశంకర్ రాజు అంటూ అద్భుతమైన ప్రాసతో పాడాడు. పుట్టిందేమో జగ్గంపేట.. చదువంతా విజయవాడ.. సినిమాలనే అతడికి కరెక్టు వచ్చేశాడంటూ అతడికి సినిమాలపై ఉన్న ఇష్టాన్ని వివరించాడు. అలా సినిమాల్లోకి వచ్చిన ఒక్క ఛాన్స్ అంటూ అడిగి అద్భుతమైన సినిమాల్లో నటించాడని వివిరంచాడు. కమిషనర్ల కూతుళ్లకు మొగుళ్లు రారా అంటూ మధ్య చెప్పిన డైలాగ్ కు రవితేజ ఫిదా అయిపోయారు. ఫుల్ గా నవ్వుకున్నారు.

ఆ తర్వాత కూడా అదిరిపోయే ప్రాసతో అనేక డైలాగ్స్, సినిమా పేర్లు వివరిస్తూ పాడిన ఈ పాట హైలెట్ గా నిలిచింది. మఉఖ్యంగా ఫన్ కావాల్నా, ఎమోషనల్ కావాల్నా.. ఏదన్నా అడుగు మన అడ్రస్ రవన్నా అంటూ రవితేజ టాలెంట్ ను వివరించాడు. ఒరేయ్ ఆజామూ.. నువ్వు లగెత్తరా అంటూ డైలాగ్ చెప్పినప్పుడు కూడా అంతా ఎగ్జైట్ అయిపోయారు. రాజా ది గ్రేట్ అంటే రవన్న గ్రేట్ అంటూ.. చిరు తర్వాత బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి క్రేజ్ తెచ్చుకున్నది నువ్వేనంటూ చెప్పుకొచ్చాడు. మీరు కూడా ఓసారి ఈ స్పెషల్ ర్యాప్ సాంగ్ విని ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











