CSI Sanatan First Evidence ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో ఆది..డిఫరెంట్ సబ్జెక్ట్‌తో థ్రిల్లర్ మూవీగా సీఎస్ఐ సనాతన్

డైలాగ్ కింగ్ సాయికుమార్‌ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సినీ రంగంలో రాణిస్తున్న ఆది సాయి‌కుమార్ తన మార్కెట్‌ను భారీగా విస్తరించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. హిట్లు, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస చిత్రాలను, భారీ ఆఫర్లను చేజిక్కించుకొంటూ దూసుకెళ్తున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ డబ్బింగ్ మార్కెట్‌లో మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకొన్నారు.

విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో రాణిస్తున్న ఆది సాయికుమార్ తాజాగా క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ (సీఎస్ఐ) ఆఫీసర్గా విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న CSI సనాతన్ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌ వివరాల్లోకి వెళితే..

 CSI Sanatan First Evidence: Aadi Saikumar looks in Intense in Crime Thriller drama

హత్య జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను ఆధారంగా హంతకులను పట్టుకొనే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ ఇంటెన్సివ్ మూడ్‌లో కనిపించారు. సంఘటనా స్థలంలో లభించిన ప్రతీ క్లూను ఆధారంగా చేసుకొని నేర పరిశోధన చేస్తూ విభిన్నమైన గెటప్‌లో కనిపించారు.

ఇంతకు ముందు కనిపించని వెరైటీ పాత్రలో ఆది ఆకట్టుకొన్నారు. తెలుగు తెరపైన ఇప్పటి వరకు రాని సబ్జెక్ట్‌తో ఆది ఓ థ్రిల్లర్‌ మూవీలో నటించారు. ఈ సినిమా నవంబర్ రెండోవారంలో రిలీజ్ కానున్నది.


న‌టీ న‌టులు: ఆది సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తారక్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వాసంతి కృష్ణన్, రవి ప్రకాశ్, భూపాల్ రాజు తదితరులు
నిర్మాత: అజ‌య్ శ్రీనివాస్
సమర్పణ: సునీత
సీఈవో: చాంగటి సంతయ్య
ద‌ర్శ‌కుడు: శివ‌శంక‌ర్ దేవ్
సినిమాటోగ్ర‌ఫి: జీ శేఖ‌ర్
ఎడిటర్: అమర్ రెడ్డి
రచన: శివ శంకర్ దేవ్
మ్యూజిక్: అనీష్ సాల్మన్
పీఆర్వో: GSK మీడియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X