twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Elections : రాముడు కల్లో కనిపించి చెప్పారు.. ఆరు కోట్లు ఆ రోజున వస్తాయి : సీవీఎల్

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి నామినేషన్‌ వేసి, ఆ తరువాత ఉప సంహరించుకున్న సీనియర్‌ నటుడు, న్యాయవాది సీవీఎల్‌ నరసింహారావు మంగళవారం మీడియా ముందుకొచ్చారు. అయితే ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

    రోజుకో కీలక పరిణామం

    రోజుకో కీలక పరిణామం

    'మా' ఎన్నికల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. చివరి వరకు అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహారావు చివరి నిమిషంలో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన మొన్న వెల్లడించారు. అన్ని వివరాలు రెండ్రోజుల్లో మీడియాకు వెల్లడిస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు.

    సభ్యుల సంక్షేమం ముఖ్యం

    సభ్యుల సంక్షేమం ముఖ్యం

    ఉపసంహరణ చేసుకున్నప్పుడే అధ్యక్ష పదవి కంటే తనకు 'మా' సభ్యుల సంక్షేమమే ముఖ్యమని పేర్కొన్న ఆయన నామినేషన్ ఉప సంహరించడానికి ప్రత్యేక కారణం ఉంది అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా చెబుతా అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం అని ఆయన ప్రకటించారు.

    రాముడు కల్లోకి వచ్చి

    రాముడు కల్లోకి వచ్చి

    ఇక తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన శ్రీరాముడు కల్లోకి వచ్చి 'అధ్యక్ష పదవి కావాలా.. 'మా' సభ్యుల సంక్షేమం కావాలా' అని అడిగితే సంక్షేమం కావాలని చెప్పి నామినేషన్‌ ఉపసంహరించుకున్నానని తెలిపారు. ఎన్నికల్లో ఏ ప్యానెల్‌ గెలిచినా 'మా' భవన నిర్మాణానికి రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఒకరు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన తెలిపారు. ఆ వ్యక్తి ఎవరు అనేది ఎన్నికల అయిన తర్వాత నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున చెబుతానని అన్నారు.

    ఎవరూ భయ పెట్టలేదు, ఆశ చూపలేదు

    ఎవరూ భయ పెట్టలేదు, ఆశ చూపలేదు

    ఇక ఈ 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకోమని నన్ను ఎవరూ భయ పెట్టలేదు, ఆశ చూపలేదు. రెండు ప్యానళ్లకు తనదో విన్నపం అని అన్నారు. మురళీమోహన్‌ తీసుకొచ్చిన రిజల్యూషన్‌ని అమలు చేయండన్నా ఆయన ఆరోగ్య బీమాను పక్కాగా అమలు చేయాలని అన్నారు. ఏ సభ్యుడు ఆకలితో బాధ పడకూడదని ఆయన పేర్కొన్నారు.

    అమలు చేసేలా

    అమలు చేసేలా

    ఇక పెన్షన్‌కు సంబంధించి ప్రస్తుతం 30మందికి నెలకు రూ.6వేలు ఇస్తుండగా మరో రూ.4వేలు కలిపి రూ.10వేలు రెండేళ్ల పాటు ఇవ్వడానికి కొందరు ఒప్పుకొన్నారు కానీ వాళ్లెవరూ 'మా' సభ్యులు కాదు. నటులను అభిమానించే వారు. నేను అధ్యక్షుడిని అయితే అమలు చేయాలనుకున్న పథకాలు గెలిచిన వాళ్లు అమలు చేేసేలా ప్రయత్నిస్తా'' అని సీవీఎల్‌ నరసింహారావు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

    Recommended Video

    Prabhas Launched Kalakhar Teaser కళాకార్ టీజర్ లాంచ్ | Rohith
    హోరాహోరీ పోరు

    హోరాహోరీ పోరు

    ఇక మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఎన్నికల వ్యవహారం అంతా ఆరోపణలు, ప్రత్యారోపణలతో భగ్గుమంటోంది. తాజాగా మంచు విష్ణు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ మీద నిప్పులు చెరిగారు. 'మా' ఎన్నికల వ్యవహారంలోకి నా కుటుంబాన్ని ఎందుకు తీసుకువస్తున్నారు అని విష్ణు మండిపడ్డారు. మరి చూడాలి ఎవరు గెలవనున్నారు అనేది.

    English summary
    CVL Narasimha Rao Sensational comments about MAA Elections. మా ఎన్నికల గురించి సీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X