RRRనూ వదలని ట్రాఫిక్ పోలీసులు.. ఇదెక్కడి వాడకం బాసూ!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయాక ప్రతి అంశాన్ని ట్రాఫిక్ రూల్స్ విషయంగా పోలుస్తూ ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆసక్తికర పోస్టులు పెడుతున్నారన్న సంగతి తెలిసిందే. సినిమాలకు సంబందించిన ఇమేజెస్, లేకపోతే ఎప్పటికప్పుడు ట్రెండ్ లో ఉన్న ఫోటోలు వాడి ట్రాఫిక్ రూల్స్ మీద ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అందులో భాగంగానే ఈ రోజు ఒక పిక్ రిలీజ్ చేశారు. నిజానికి టాలీవుడ్ మాత్రమే కాక ప్రపంచం మొత్తం మీద ఉన్న సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఆ పోస్టర్లో ఎన్టీఆర్ బండి తోలుతూ ఉండగా వెనుక రామ్ చరణ్ తేజ కూర్చుని ఉన్నట్టు చూపించారు.. ఈ పోస్టర్ రిలీజ్ చేయడమే కాక ఇంకా రెండు పాటలు మాత్రమే షూటింగ్ మిగిలి ఉన్నాయని మిగతా సినిమా షూటింగ్ అంతా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ రెండు భాషలకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారని చెబుతూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.. ఈ పోస్టర్ సైబరాబాద్ పోలీసుల కంట పడడంతో వెంటనే తమ క్రియేటివిటీకి పని చెప్పారు.
రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరికీ చెరొక హెల్మెట్ తగిలించి ఇప్పుడు సరిపోయింది, కరెక్ట్ గా ఉంది, హెల్మెట్ వాడండి హ్యాపీగా ఉండండి అంటూ ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా రిలీజ్ చేశారు.. దీంతో నెటిజనులు ఇదేం వాడకం రా బాబు అనుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రాజమౌళి సినిమా అంటే ఎప్పుడు లేట్ అవుతుంది అని భావిస్తున్న తరుణంలో ఈ సినిమాని మాత్రం అక్టోబర్ 13వ తేదీ 2021కి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసేటట్టుగానే ఉన్నట్టు హింట్ ఇస్తున్నారు. నిజంగా ఆ రోజుకి రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











