‘గజ’ బాధితులకు సూర్య, విజయ్ సేతుపతి భారీ విరాళం.. విశాల్, వరలక్ష్మీ కూడా
తమను అభిమానించే ప్రజలు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకొనేందుకు సినీ ప్రముఖులు వస్తుండటం మనకు తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రం గజ తుఫాన్‌తో తల్లడిల్లుతున్నది. తమిళనాడులోని తంజావూర్, తిరువరుర్, పుదుకొట్టాయ్, నాగపట్నం, దిండిగల్ జిల్లాలు గజ తుఫాన్ బారిన పడ్డాయి. దాదాపు 80 వేల మందికి బాధితులుగా మారారు. తుఫాను బాధితులకు సహాయం అందించేందుకు విశాల్, విజయ్ సేతుపతి, సూర్య, వరలక్ష్మీ శరత్ కుమార్, జీవి ప్రకాశ్ తదితరులు స్పందించారు.
సూర్య, జ్యోతిక, శివకుమార్ తమ కుటుంబం తమ స్వచ్ఛంద సంస్థ తరఫున రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకోవాలని కోరారు.
తుఫాను బాధితుల కోసం నటుడు విజయ్ సేతుపతి రూ.25 లక్షల విలువైన సహాయాన్ని అందించారు. అలాగే సహాయం అందించాలనుకొనే వారు సంబంధిత అకౌంట్లకు నిధులు ఇవ్వాలని ఆయా లింకులను జీవి ప్రకాశ్ షేర్ చేశారు.

తమిళనాడు ప్రజలు గజ తుఫాన్‌తో తల్లడిల్లుతున్నారు. వారిని ఆదుకొనేందుకు ముందుకు రండి. వారికి ఆహారం, బట్టలు, నిత్యావసర వస్తువులు కాకుండా.. వారి ఇంటికి కప్పు వేయడానికి తాటి మట్టలు తదితర సామాగ్రిని అందించండి అంటూ విశాల్ ట్వీట్ చేశారు.
వరదలు చెన్నైను కప్పేసినప్పుడు మనం స్పందించిన తీరుకు దేశవ్యాప్తంగా ప్రజలు అభినందించారు. మళ్లీ తమిళ ప్రజలు ప్రకృతి విలయతాండవం బారిన పడ్డారు. ఆహారం, నీళ్లు, కరెంట్ లాంటి వసతులు లేవు. వారిని ఆదుకొందామని వరలక్ష్మీ పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











