విక్టరీ వెంకటేష్‌పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

F2 విజయం తర్వాత విక్టరీ వెంకటేష్ సినిమాల వేగాన్ని పెంచుతున్నారు. సక్సెస్ జోష్‌తో వెంకీ మామ సినిమాను పట్టాలెక్కించారు. తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. వెంకీ మామ సినిమా ఓ వైపు నడస్తుండగా.. మరో వైపు వెంకటేష్ విక్రమ్ వేద చిత్రంలో నటిస్తున్నారనే వార్త మీడియాలో ప్రముఖంగా కనిపించింది.

విక్రమ్ వేద చిత్రంలో వెంకటేష్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు అనే వార్త మీడియాలో వైరల్ అయింది. గతంలో కూడా ఇలాంటి వార్త మీడియాలో కనిపించగా, ఓ నిర్మాత మీడియాకు వివరణ ఇచ్చారు.

D Suresh Babu: No truth in Vikram Vedha remake as Venkatesh hero

తాజాగా విక్రమ్ వేద చిత్రంలో వెంకటేష్ నటిస్తున్నారనే వార్తపై ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. విక్రమ్ వేద తెలుగు రీమేక్‌లో వెంకటేష్ నటిస్తున్నారనే వార్తలో వాస్తవం లేదు. ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. తదుపరి చిత్రాల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అని సురేష్ బాబు ప్రకటన ఇచ్చారు.

గతేడాది విడుదలైన విక్రమ్ వేద తమిళంలో ఘన విజయం సాధించింది. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X