"వాల్తేరు వీరయ్య"ని మించి అన్నారు.. కట్ చేస్తే "డాకు మహారాజ్"కి ఘోరమైన అవమానం
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎప్పుడు నుంచో ఒకే స్టార్డంని మైంటైన్ చేస్తూ రావడం అనేది చాలా తక్కువమంది హీరోలకి మాత్రమే సాధ్యపడింది అని చెప్పాలి. మరి అలాంటి అరుదైన హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. అయితే తనతో ఉన్న ఇతర కో స్టార్స్ నెమ్మదిగా మధ్యలో ఫామ్ కోల్పోయి ఇపుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు కానీ వీరిలో చిరంజీవి మార్కెట్ మాత్రం ఇప్పటికీ సెపరేట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడంతోనే ఎప్పుడో 2017లోనే 100 కోట్ల షేర్ సినిమాని సెట్ చేశారు. అయితే అప్పటికి తన తోటి సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ నాగార్జునలు 50 కోట్ల షేర్ సినిమాలు అందుకోవడమే ఒకింత కష్టం అయ్యేది. కానీ తర్వాత మాత్రం చిరు మళ్ళీ స్ట్రగుల్ కావాల్సి వచ్చింది.

చిరు నుంచి ఓ సినిమా హిట్ టాక్ వస్తే అది ఇండస్ట్రీ హిట్ లెవెల్లో రీసౌండ్ చేస్తుంది అని లేకపోతే అదే ఇండస్ట్రీలో దారుణమైన నష్టాలు మిగిల్చే సినిమాల్లా కూడా నిలిచిపోతాయి. కాగా ఇలా మెగాస్టార్ చిరంజీవి కొట్టిన రికార్డు హిట్స్ లో ఊహించని లాభాలు అందించిన సినిమా మాత్రం "వాల్తేరు వీరయ్య" అని చెప్పాలి. గత 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడూ చూడని లాభాలు అందించింది అని చెప్పుకొచ్చారు.
అయితే ఇందులో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఉన్నప్పటికీ మెగాస్టార్ స్టార్ పవర్ ఆ రేంజ్ హిట్ అవ్వడానికి మ్యానేజ్ చేసింది అని చెప్పవచ్చు. మరి ఇలాంటి సినిమాని మించి సూపర్ టాక్ అందుకున్న సినిమా పైగా నిర్మాతే వాల్తేరు వీరయ్య కంటే మంచి కంటెంట్ తో వస్తున్నామని ముందే చెప్పారు. మరి అంత నమ్మకంగా చెప్పిన సినిమానే "డాకు మహారాజ్".

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నాగవంశీ ఎంతో ఇష్టంగా నిర్మాణం వహించిన ఈ సినిమాని అదే వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమాకి వాల్తేరు వీరయ్యలా కాకుండా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ పడింది. కానీ సీన్ కట్ చేస్తే ఇలాంటి సంక్రాంతి సీజన్ లో కూడా కొన్ని కీలక ఏరియాల్లో ప్లాప్ గానే నిలిచినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.
కాగా డాకు మహారాజ్ ని వాల్తేరు వీరయ్య కంటే ఎక్కువగా వర్ణించినప్పటికీ 100 కోట్ల షేర్ అందుకోవడంలో ఈ సినిమా చాలా స్ట్రగుల్ అవుతుంది. పైగా నైజాంలో పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలేదట. ఇక దీనితో పాటుగా నందమూరి హీరోలకి అలాగే బాలకృష్ణకి కూడా స్ట్రాంగ్ జోన్ అయినటువంటి సీడెడ్ లో కూడా నష్టాలతోనే రన్ ని ముగించుకుంది అట. దీనితో వాల్తేరు వీరయ్యని మించి కొట్టబోతున్నామని ప్రొజెక్ట్ చేసుకున్న ఈ సినిమా అనూహ్యంగా కీలక ఏరియాల్లోనే అది కూడా సూపర్ హిట్ టాక్ తో కూడా ప్లాప్ గా నిలిచిపోవడం అనేది షాకింగ్ అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











