ఊర్వశిని బాలయ్య కొట్టాడా? నేను కొట్టానా? నా ఇంట్రెస్ట్ అదే.. నాగవంశీ

నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో పాటు వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడ లేని హైప్ నెలకొంది.

విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే యూఎస్‌లోని డల్లాస్‌లో నందమూరి అభిమానులు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సందడి చేసింది. అనంతపురం, హైదరాబాద్‌లలో త్వరలో రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగనున్నాయి. వీటి కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్లతో డాకు మహారాజ్ ప్రచారం ముగుస్తుందని టాక్.

daaku maharaj Producer suryadevara naga Vamsi reacts trolling on Nandamuri balakrishna s dabidi dibidi song dance with urvashi rautela

డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణ - ఊర్వశి రౌటేలాల మధ్య వచ్చిన దబిడి దిబిడి సాంగ్‌పై విపరీతంగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఊర్వశి నడుముపై బాలయ్య దరువు వేయడంతో పాటు నాభి భాగంలో చేయి వేసి ఊర్వశి డ్రెస్‌ను పట్టుకునే సీన్ ఉండటంతో నెటిజన్లు మరోసారి రెచ్చిపోతున్నారు. వయసుతో పాటు ప్రజా జీవితంలో ఉన్న బాలకృష్ణ ఇలాంటి పాటల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇదే సమయంలో ఊర్వశి రౌటేలాను ఉద్దేశించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4లో డాకు మహారాజ్ చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా ఊర్వశిపై నీ ఓపీనియన్ ఏంటని వంశీని బాలయ్య అడుగుతాడు. ఊర్వశి మీద తనకున్న ఒపీనియన్ కానీ చెప్పానంటే నా భార్య నాకు విడాకులు ఇచ్చేస్తుంది అంటూ నాగవంశీ కామెంట్ చేశాడు. ఆయన వ్యాఖ్యలు చిత్ర సీమలో దుమారం రేపాయి.

daaku maharaj Producer suryadevara naga Vamsi reacts trolling on Nandamuri balakrishna s dabidi dibidi song dance with urvashi rautela

తాజాగా డాకు మహారాజ్ ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగవంశీ, దర్శకుడు బాబీ , హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌లు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దబిడి దిబిడి సాంగ్‌లోని స్టెప్స్.. నాగవంశీ ఇంట్రెస్టా? కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తారు. దీనికి నాగవంశీ సమాధానమిస్తూ.. ఊర్వశిని కొట్టింది నేనా? బాలకృష్ణ గారు కొట్టేదానికి నా ఇంట్రెస్ట్ ఏముంటుంది అని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులకు మాస్ సాంగ్‌ ఇవ్వాలని అనుకున్నానని .. అంతే తప్పించి ఊర్వశిని ఎక్కడ కొట్టాలని నేను డిసైడ్ చేస్తానా అని వంశీ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు దబిడి దబిడి సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X