Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కియారా అద్వానీ నగ్న ఫోటో.. అచ్చం అలాగే టబు న్యూడ్ పిక్.. ట్రోల్స్‌పై ఫొటోగ్రాఫర్ రియాక్షన్
యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ కియారా అద్వానీకి సంబంధించిన న్యూడ్ పిక్ ఇటీవల సోషల్ మీడియా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫేమస్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ తీసిన ఈ ఫోటో షూట్ హాట్ హాట్ చర్చలను లేవనెత్తింది. కియారా అద్వానీ బోల్డ్ పిక్ చూసి షాకైన నెటిజన్లు ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ తీరును తప్పుబడుతూ ట్రోల్స్ చేశారు. అయితే వాటికి చెక్ పెట్టేస్తూ తాజాగా సీనియా హీరోయిన్ టబు సెమీ న్యూడ్ పిక్ షేర్ చేసి మరో సంచలనం సృష్టించాడు డబూ రత్నానీ. వివరాల్లోకి పోతే..
ఆకు చాటు అందాలు.. సోషల్ మీడియాలో వైరల్
ఇటీవలే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసి వార్తల్లో నిలిచింది కియారా అద్వానీ. ఒంటి మీద నూలు పోగులేకుండా, కేవలం ఆకు చాటున అందాలను దాచి స్పెషల్ కిక్కిచ్చింది ఈ బ్యూటీ. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది క్యాలెండర్ కోసం ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ తీసిన పిక్ ఇది.
నగ్న ఫోటోపై ఊపందుకున్న ట్రోల్స్..
అయితే ఈ పిక్ చూసిన నెటిజన్లు తెగ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాను సెగలు పుట్టిస్తున్న ఈ పిక్ చూసి బోల్డ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ మేరీ బార్ష్ గతంలో చేసిన ఓ ఫొటో షూట్‌కు ఇది కాపీ అంటూ విమర్శలు గుప్పించారు.
2002లో టబు.. టాప్‌లెస్ పోజు
దీంతో ఈ విషయమై క్లారిటీ ఇస్తూ అదే సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు డబూ రత్నాని సమాధానమిచ్చారు. గతంలో తనే తీసిన టబు ఫొటోను పోస్ట్ చేశారు. 2002లో డబూ చేసిన ఓ ఫొటోషూట్ కోసం టబు ఇదే తరహాలో టాప్‌లెస్ ఫోజిచ్చింది. ఇప్పటి కియార ఫొటోకు గతంలో తనే చేసిన టబు ఫొటోషూట్ కారణమని పేర్కొంటూ ఆ పిక్‌ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు డబూ.
|
ఇటు కియారా.. అటు టబు.. స్పెషల్ ట్రీట్
దీంతో ఇటు కియారా, అటు టబు టాప్ లెస్ పోజులను జత చేస్తూ యంగ్ అండ్ ఓల్డ్ అందాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికైతే కియారా కారణంగా మరోసారి టబు టాప్ లెస్ ట్రీట్ చూడాల్సివచ్చింది నెటిజన్లు. ఈ టాప్ లెస్ టబు పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Recommended Video
కియారా జర్నీ.. వరుస కమిట్మెంట్స్
ఇక కియారా విషయానికొస్తే.. టాలీవుడ్లో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమా, రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' అనే సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్లో జెండా పాతింది కియారా. అక్కడ వరుస కమిట్మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. నెట్టింట హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ఆడియన్స్‌కి కిక్కు మీద కిక్కు ఇస్తోంది.