Dacoit Teaser Review: డాక్టర్‌ని కాదు దొంగని.. అంచనాలు పెంచేసిన డెకాయిట్ టీజర్
క్షణం, గూడచారి, ఎవరు, మేజర్, హిట్ 2 చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అడివి శేష్. ఆయన హీరోగా నటిస్తోన్న మూవీ డెకాయిట్. షానీ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మారీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
అడివి శేష్,సునీల్ డియోలు ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉగాది కానుకగా 2026 మార్చి 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా డిసెంబర్ 18న డెకాయిట్ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ వివరాలు పరిశీలిస్తే..

వింటేజ్ సాంగ్‌తో టీజర్
1.31 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్‌లో సిగరెట్ కాలుస్తూ అడివి శేష్ ఎంట్రీ ఇస్తాడు. కారులో మృణాల్ ముసుగు వేసుకుని ఉండగా పోని ముద్దు పెట్టేదా? అని అడుగుతాడు అడివి శేష్. అనంతరం హీరోని హీరోయిన్ కారులో ఎక్కడికో తీసుకెళ్తుండగ ఫైరింగ్ జరుగుతుంది. ఆ వెంటనే హలో బ్రదర్ సినిమాలోని కన్నెపిట్టరో కన్నుకొట్టరో అనే సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా అడివి శేష్ జైలులో ఖైదీగా ఎంట్రీ ఇస్తాడు. అలాగే అతనిని పోలీసులు వ్యానులోఎక్కడి నుంచో తరలిస్తుండగా ఆ వ్యాన్ పట్టాలపై ఆగిపోయి ట్రైన్ వచ్చి ఢీకొడుతుంది.
యాక్షన్‌తో ఇరగదీసిన అడివి శేష్
ఆ తర్వాత అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, సునీల్, ప్రకాష్ రాజ్ తదితర పాత్రలను పరిచయం చేశారు. టీజర్ మొత్తం అడివి శేష్‌ను మృణాల్ కారులో తీసుకెళ్తూ, తప్పిస్తూ ఉంటుంది. చివరిలో ఒక పాప నువ్వు డాక్టర్‌వా అని అడివి శేష్‌ను అడగ్గా.. కాదు దొంగని అడివి శేష్ అంటాడు. అనంతరం వచ్చే ఉగాదికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి టీజర్‌కు ఎండ్ కార్డ్ వేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజింగ్‌లు, లవ్ స్టోరీ, డ్రామాతో మొత్తానికి టీజర్ అయితే అంచనాలు పెంచేసిందని రివ్యూలు చెబుతున్నాయి.
డెకాయిట్ స్టోరీపై సస్పెన్స్
అడివి శేష్ పాత్ర మౌనంగా చాలా మిస్టీరియస్‌గా ఉంటుందని తెలుస్తోంది. హీరో అస్సలు మాట్లాడకుండా, అడపాదడపా పంచ్ డైలాగులు విసురుతున్నట్లు చూపించాడు. స్టోరీని రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేసేలా టీజర్ కట్ చేశారు. అడివి శేష్ లుక్, స్టైలీష్ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ.. ప్రేక్షకులకు మరోసారి మేజర్, గూడచారి సినిమాలను గుర్తుచేస్తాయి. మృణాల్ ఠాకూర్ గ్లామరస్‌గా కనిపించడంతో పాటు కథకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఈ డెకాయిట్ టీజర్‌కు ప్లస్‌గా మారింది. ఆయన ఇందులో నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. ఇక భీమ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. మరి తెరపై డెకాయిట్ విన్యాసాలు చూడాలంటే మార్చి 19 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











