విశ్వకవి జయంతి: జాతీయభావం పొంగేలా దాడి మూవీ ఫస్ట్‌లుక్
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయన రచించిన గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన స్మరించుకుంటూ తెరకెక్కిస్తున్న చిత్రం దాడి. రవీంద్రుడి భావాలను ఓ వ్యవస్థని కథగా రాసుకొన్నామని దర్శకుడు మధు పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా దాడి సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ... సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశాం. నిర్మాత శంకర్ ఏ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తామన్నారు.

నిర్మాత ఏ శంకర్ మాట్లాడుతూ.. జాతీయ భావం ఉట్టిపడేలా దాడి సినిమాను రూపొందించాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది అని అన్నారు.
నటీనటులు:
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు, గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ , అజయ్ రత్నం, నాగినీడు, అజయ్ ఘోష్, మధు, అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండ, దిల్ రమేష్, సితార తదితరులు
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: శంకర్ ఏ
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మధు శోభ టి
కెమెరామెన్: శ్యామ్ కే నాయుడు
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
డాన్స్: రాజ్‌సుందరం, శివశంకర్, శేఖర్
స్టంట్స్: కనల్ కన్నన్, వెంకట్
లిరిక్స్: కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ


Click it and Unblock the Notifications











