Daggubati Abhiram Wedding: అంగరంగ వైభవంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?

తెలుగు సినీ రంగానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు ఈ మధ్య వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఎవరూ ఊహించని వాళ్లు కూడా బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పేసి ఓ ఇంటి వాళ్లు అవుతున్నారు. ఇటీవలే మెగా వారసుడు.. వరుణ్ తేజ్, టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. ఏదో మమా అనిపించినట్లు మాత్రం కాదండోయ్... చాలా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇటలీలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఒక్కటయ్యారు.

తాజాగా ఇదే బాటలో నడిచారు... దగ్గుబాటి రానా తమ్ముడు, దగ్గుబాటి అభిరామ్. దగ్గుబాటి రామానాయుడు మనవడు, సురేష్ బాబు రెండో కుమారుడు, రానా సోద‌రుడు అయిన ద‌గ్గుబాటి అభిరామ్ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో డిసెంబర్ ఆరవ తేదీన అంందరి సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మీరూ ఓ సారి ఆ ఫొటోలను చూసేయండి. అయితే అభిరామ్ మూడు ముళ్లు వేసింది ఎవరి మెడలోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 Daggubati Abhiram Destination Wedding Grandly Celebrated in Srilanka And Check Full Details

అభిరాన్ మేనమామ కుమార్తె.. మరదలు అిన ప్రత్యూషనే ఆయన పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5 తేదీ నుంచే హ‌ల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్య‌క్ర‌మాలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే డిసెంబర్ ఆరో తేదీ బుధవారం రాత్రి 8.50 గంటలకు వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే సెలబ్రిటీలు అందరూ ఇటలీ, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెళ్లి చేసుకుంటే అభిరామ్ మాత్రం అందరికంటే భిన్నంగా శ్రీలంకు వెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆయన అక్కడే పెళ్లి చేసుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయేమో తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

ప్రత్యూష కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు అభిరామ్ బంధువులు, స్నేహితులు.. సినీ, రాజకీయ ప్రముఖులు అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతా అంటే అంతా కాదండోయ్.. కేవలం 200 మంది అతి దగ్గరి వాళ్లు మాత్రమే ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. దంపతులిద్దరినీ ఆశీర్వాదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలో వైరల్ అవుతుండగా... రానా మాత్రం పెళ్లి ఫొటోల్లో కనిపించలేదు. రానా, మిహికల జంటను చూడాలని నెటిజెన్లు అంతా ఉవ్విళ్లూరుతుండగా... వాళ్లు మాత్రం కనిపించట్లేదు. చూడాలి మరి ఇంకొన్ని రోజుల్లోనైనా వారి ఫొటోలు బయటకు వస్తాయా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X