సినీ కార్మికులకు అండగా.. దగ్గుబాటి ఫ్యామిలీ భారీ విరాళం
కరోనా వైరస్ తాండవం చేస్తున్న నేపథ్యంతో దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. తినడానికి తిండి లేక ఎంతో మంది కష్టాలు అనుభవిస్తున్నారు. రోజువారి కూలీలు, రెక్కాడితో గానీ డొక్కాడని పేద ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇక చిత్రసీమ పూర్తిగా షట్ డౌన్ కావడంతో అక్కడి పేద కళాకారులు, సినీ శ్రామికులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
సినీ కార్మికులను ఆదుకునేందుకు స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి పెద్ద మనస్సును చాటుకున్నాడు. ప్రతీ టెక్నీషియన్, ప్రతీ పేద కళాకారునికి సాయ పడేవిధంగా చూడాలని కోరాడు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ కూడా సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.

సినిమా పరిశ్రమ మూత పడటంతో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులు, ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న హెల్త్ వర్కర్లకు మానవతా దృక్పథంతో కోటి రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు దగ్గుబాటి కుటుంబం ప్రకటించింది. ఈ మేరకు దగ్గుబాటి కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు, హీరోలు వెంకటేష్, రానాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











