అల్లు అర్జున్ - పవన్‌లలో ఎవరు పెద్ద స్టారంటే.. ‘మెగా ’ చిచ్చులేపిన స్టార్ ప్రొడ్యూసర్
మెగా ఫ్యామిలీలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి మొన్న నంద్యాలలో వైసీపీ అభ్యర్ధికి మద్ధతు పలికే వరకు మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించడం వరకు మెగా అభిమానులు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఇవి యాధృచ్ఛికంగా జరిగాయా లేక పరిస్ధితుల ప్రభావమా అన్నది తెలియకపోయినా అల్లు అర్జున్ కారణంగా మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్- అల్లు అర్జున్‌లను పోల్చి చూడటం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్‌కు కారణమైంది.
ఇదంతా మీడియా ప్రచారమే తప్పించి, మెగా ఫ్యామిలీలో అంతా ఏకతాటిపైనే ఉన్నారని చెప్పుకోవడానికి లేదు. దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి పొందారు. ఆయన విజయాన్ని మెగా కాంపౌండ్ గ్రాండ్‌గా సెలబ్రెటీ చేసింది. కానీ ఈ కార్యక్రమాల్లో బన్నీ కానీ , అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించలేదు. నాగబాబు, సాయిథరమ్ తేజ్‌లు అల్లు అర్జున్‌పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు. అయితే పెద్దలు కల్పించుకుని గొడవను చక్కదిద్దినట్లుగా ఫిలింనగర్‌లో ఇప్పటికీ చర్చనీయాంశమయ్యాయి.

ఇదంతా ఓ ఎత్తయితే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినే లేటెస్ట్ మూవీ పుష్ప - 2 వాయిదా పడటం అనేక అనుమానాలకు తావిచ్చింది. మెగా, పవన్ ఫ్యాన్స్‌కి భయపడే ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్‌కి మారిందని సోషల్ మీడియాలో చర్చ నడిచింది. గతంలో మెగా ఫ్యాన్స్ కారణంగా అల్లు అర్జున్ సినిమాపై విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కొంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ వేడి తగ్గే వరకు ఆగటమే బెటర్ అని పుష్ప మేకర్స్ నిర్ణయించినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ వివాదం కాస్త సద్దుమణుగుతున్న దశలో రావు రమేశ్ హీరోగా నటించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ బన్నీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అల్లు అర్జున్ ఇన్‌డైరెక్ట్‌గానే కౌంటర్లు వేశారంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ వరుస సంఘటనలతో అల్లు అర్జున్ ఓ సెక్షన్‌కు టార్గెట్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉండేవాళ్లు, అభిమానులు బన్నీ పేరు చెబితే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

ఇలాంటి దశలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్, పవన్ , అల్లు అర్జున్‌లలో ఎవరు పెద్ద స్టార్ అనేది బాక్సాఫీస్ నెంబర్స్‌ను బట్టి చెప్పడం కష్టమన్నారు. సినిమా కలెక్షన్స్ దర్శకుడిపైనా ఆధారపడి ఉంటాయని పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్‌ల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయన్నారు. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలనే ఆదరిస్తారని సురేష్ బాబు అన్నారు. టాలీవుడ్‌లో రూ.100 కోట్లను సాధించే హీరోలు చాలా మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సురేష్ బాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











