twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీలో థియేటర్లు నడపలేను... నిర్మాత సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్!

    |

    టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ఇప్పుడు కొద్దిరోజులుగా అనేక విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన సోదరుడు వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ నారప్ప సినిమా డిజిటల్ రిలీజ్ కారణంగా సురేష్ బాబు అందరికీ టార్గెట్ గా మారాడు. తాజాగా ఆయన ఏపీలో థియేటర్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    నారప్ప రిలీజ్

    నారప్ప రిలీజ్


    తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ అనే సినిమాని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ముందు నుంచి ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అనూహ్యంగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ అలాగే వి క్రియేషన్స్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

     ప్రమోషన్స్ లో భాగంగా

    ప్రమోషన్స్ లో భాగంగా


    అయితే సురేష్ బాబు స్వయంగా నిర్మాత కావడం ఆయనకు అనేక థియేటర్లు కూడా ఉండడంతో ఇలా ఎలా చేస్తారు అంటూ ఆయనను తెలంగాణ ఫిలిం ఛాంబర్ సహా అనేక మంది సినీ నిర్మాతలు, అభిమానులు కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. దీంతో ఆయన ఇప్పుడు తానేమీ చేయలేనని ఇది తన చేతిలో పని కాదని తేల్చి చెప్పేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన అనేక చానెళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

    బయటకొచ్చిన ఫన్ బకెట్ భార్గవ్.. ఇక రణమే, మీ సపోర్ట్ కావాలంటే, ఆడుకుంటున్నారుగా!

    నడపడం కష్టం

    నడపడం కష్టం

    తాజాగా ఒక న్యూస్ చానల్ కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో థియేటర్లు నడపడం కష్టం అని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల విషయం గురించి మీ స్పందన ఏమిటి అని సదరు యాంకర్ ప్రశ్నించగా ఆయన ఈ కామెంట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం బిసి సెంటర్లలో 20, 30 రూపాయల టికెట్లు అమ్మాల్సి ఉంటుందని అన్నారు.

    ఆ రేట్లతో నా వల్ల కాదు

    ఆ రేట్లతో నా వల్ల కాదు

    అసలు ఆ రేట్లతో ఆంధ్రప్రదేశ్లో థియేటర్లలో సినిమా రిలీజ్ చేయడం అనేది తన వల్ల కాదని ఆయన చేతులెత్తేశారు. తనకు అయ్యే ఖర్చు కూడా ఆ టికెట్ రేట్లతో రాదని ఆయన తేల్చేశారు. అయితే పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు టికెట్ రేట్లు పెంచి అనుకోవచ్చు కదా అని కొందరు సినీ పెద్దలు భావిస్తున్నారని కానీ అన్ని చోట్ల ఒకే టికెట్ రేటు ఉన్నప్పుడే తాను థియేటర్లు నడపగలనని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

    ఉదయ్ కిరణ్, తరుణ్ లతో పోల్చద్దు.. నేనలా కాదంటూ వరుణ్ సందేశ్ కీలక వ్యాఖ్యలు!ఉదయ్ కిరణ్, తరుణ్ లతో పోల్చద్దు.. నేనలా కాదంటూ వరుణ్ సందేశ్ కీలక వ్యాఖ్యలు!

    Recommended Video

    Telugu producers Ask For 100% Theatre Occupancy |తమిళనాడు లో ఇచ్చినట్టే ఇక్కడకూడా | Filmibeat Telugu
    ఏడిట్లో ఒక్కటే నాది

    ఏడిట్లో ఒక్కటే నాది

    ఇక తన సినిమాల డిజిటల్ రిలీజ్ గురించి కూడా ఆయన కీలక వివరాలు వెల్లడించారు. సురేష్ ప్రొడక్షన్స్ కింద మొత్తం ఏడు సినిమాలు తెరకెక్కుతున్నాయి అని వెల్లడించిన ఆయన అందులో తరుణ్ భాస్కర్ తో మాత్రమే సురేష్ ప్రొడక్షన్ సంస్థ సింగిల్ గా నిర్మిస్తోందని మిగిలిన ఆరు సినిమాలు తాను వేరే నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నా అని ఆయన వెల్లడించారు.

    English summary
    Film producer D Suresh Babu says he cant run theatres in andhra pradesh . with the latest ticket rates issue he made these comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X