పంచె కట్టులో మామ అల్లుడు అదరగొట్టేశారుగా! బొమ్మే ఇలా ఉంటే ఇక సినిమా..
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ లాంటి నేటితరం స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. అంటే రియల్ మామతో రీల్ అల్లుడు నటిస్తున్నాడన్నమాట.
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో షూటింగ్ చేస్తూనే మధ్యమధ్యలో సినిమాకు సంబందించిన అప్‌డేట్స్ ఇస్తూ 'వెంకీమామ'పై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు వినాయక చవితి సందర్బంగా విడుదల చేసిన ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో మామ అల్లుడు నాగ చైతన్య, వెంకటేష్ పంచె కట్టి సాంప్రదాయ దుస్తుల్లో అలా నడుచుకుంటూ వస్తూ కనిపించారు. ఒకరి భుజంపై మరొకరు చేయి వేసి చిరునవ్వు చిందిస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ చూసి ఇటు దగ్గుబాటి అభిమానులు, అటు అక్కినేని అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక ఈ పోస్టర్ టాక్ చూస్తే.. ''బొమ్మే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు'' అని చెప్పుకుంటున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











