పవన్‌కళ్యాణ్‌కి ఇచ్చాడు.. వరుణ్ తేజ్‌కి ఇవ్వడా ఏంటి.. రచ్చ రచ్చే.. వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా 'వాల్మీకి'. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 20వ తేదీన వాల్మీకి విడుదల కానున్న నేపథ్యంలో నిన్న (ఆదివారం) చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఆ వివరాలు చూద్దామా..

అంగరంగ వైభవంగా వేడుక.. వెంకటేష్ అట్రాక్షన్

అంగరంగ వైభవంగా వేడుక.. వెంకటేష్ అట్రాక్షన్

హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ఆదివారం సాయంత్రం వాల్మీకి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్‌ హాజరై సందడి చేశారు. కార్యక్రమానికి హోస్ట్‌గా సుమ అదరగొట్టేసింది. ఈ సందర్బంగా వాల్మీకి ఆడియో సీడీని వెంకటేష్ ఆవిష్కరించారు.

Recommended Video

Varun Tej Speech At Valmiki Press Meet
నా కోబ్రా.. పూర్తిగా లుక్ మార్చేశాడు

నా కోబ్రా.. పూర్తిగా లుక్ మార్చేశాడు

ఈ సందర్బంగా వేదికపై ఎంతో ఆసక్తికరంగా మాట్లాడారు వెంకటేష్. ఇటీవలే వరుణ్ తేజ్‌తో కలిసి 'ఎఫ్‌2' సినిమా చేసిన వెంకటేష్ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ తనదైన శైలిలో స్పందించారు. 'వరుణ్‌ 'ఎఫ్‌2'లో నా కోబ్రా.. ఈ సినిమాలో పూర్తిగా లుక్‌ మార్చేశాడని అన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ చూడగానే టెర్రిఫిక్‌ అనుకున్నానని ఆయన చెప్పారు.

రేపు థియేటర్స్‌లో రచ్చ రచ్చే

రేపు థియేటర్స్‌లో రచ్చ రచ్చే

గద్దల కొండ గణేష్‌.. రేపు థియేటర్స్‌లో రచ్చ రచ్చే. ఆ 'వాల్మీకి' దొంగ.. మంచిగా మారి రామాయణం రాశారు. మరి ఈ 'వాల్మీకి' ఏం రాశాడనేది థియేటర్స్‌కి వెళ్లి చూడాలని వెంకటేష్ పేర్కొన్నారు. వరుణ్‌ తేజ్ రెచ్చిపోయి తప్పకుండా ఒక సూపర్‌ బ్లాక్‌ బస్టర్‌ కొట్టేస్తాడని తనకు నాకు నమ్మకముందని అన్నారు. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ తనకు మిత్రుడని ఆయన తెలిపారు.

మా వరుణ్‌కి తప్పకుండా సూపర్‌ హిట్‌

మా వరుణ్‌కి తప్పకుండా సూపర్‌ హిట్‌

''నా స్నేహితుడైన హరీష్‌ శంకర్‌.. పవన్‌కళ్యాణ్‌కి 'గబ్బర్‌సింగ్‌' రూపంలో భారీ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చారు. అదే బాటలో మా వరుణ్‌కి తప్పకుండా సూపర్‌ హిట్‌ ఇస్తాడు. 14 రీల్స్‌ ప్రొడ్యూసర్స్‌ రామ్‌, గోపి నాతో 'నమో వెంకటేశ' సినిమా చేశారు. వెరీ ఫ్యాషనేట్‌ అండ్‌ హంబుల్ ప్రొడ్యూసర్స్‌. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యి మంచి కలెక్షన్‌ రావాలని కోరుకుంటున్నాను'' అని వెంకటేష్ పేర్కొన్నారు.

 గద్దలకొండ గణేష్.. మాములుగా ఉండదు మరి

గద్దలకొండ గణేష్.. మాములుగా ఉండదు మరి

గద్దలకొండ గణేష్ రూపంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగితున్నాడు. వాల్మీకి సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ లుక్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. గతంలో చూడని విధంగా వరుణ్ లుక్, క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చూడబోతున్నాం అని అంటున్నారు యూనిట్ సభ్యులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X