చాలా బాధేస్తోంది.. వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్.. రామానాయుడిని గుర్తు చేసుకుంటూ!
దగ్గుబాటి వారసుడు, సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన తండ్రి రామనాయుడిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్బంగా స్వర్గీయ రామనాయుడిని నెమరు వేసుకుంటూ ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశారు వెంకటేష్. ఆ వివరాలు చూద్దామా..

వెంకటేష్ బర్త్ డే కానుక.. వెంకీమామ మూవీ
వెంకటేష్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వెంకీ మామ'. దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో వెంకటేష్ అల్లుడు అక్కినేని నాగచైతన్య కూడా నటించాడు. వీరిద్దరితో అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా ఆడిపాడారు. ఈ రోజే (డిసెంబర్ 13) వెంకటేష్ బర్త్ డే కానుకగా ఈ సినిమా విడుదలైంది.

వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్
అల్లుడితో కలిసి నటించిన 'వెంకీమామ' సినిమా రిలీజ్, తన పుట్టిన రోజు ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు వెంకటేష్. ఈ మేరకు అందరూ వెంకీమామ సినిమాను థియేటర్లకు వెళ్లి చూడండని విజ్ఞప్తి చేశారు వెంకీ.

వీ మిస్ యూ నాన్న.. చాలా బాధేస్తోంది
‘‘ఈ రోజు మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం నాన్న! వీ మిస్ యూ.. ‘వెంకీమామ' సినిమా ఇప్పుడు మీ అందరిది. దగ్గరలోని థియేటర్‌కు వెళ్లి చూడండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి'' అంటూ వెంకటేష్ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు మేనల్లుడు నాగ చైతన్యతో చిన్నప్పుడు దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
రామానాయుడు కల.. అది తీరకుండానే
ఇక తన కొడుకు వెంకటేష్, మనవాళ్లందరితో కలిసి ఒక సినిమా తీయాలని రామానాయుడు కలగనే వారని, ఆ కల నెరవేరకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్లారని డి.సురేష్ బాబు ఆవేదన చెందిన సంగతి తెలిసిందే. వెంకటేష్, రానా, నాగ చైతన్యలతో కలిసి నాన్నగారు ఒక సినిమా చేయాలనుకునేవారని, అందుకే ‘వెంకీమామ' సినిమాను ఆయనకు అంకితమిస్తున్నామని సురేష్ బాబు పేర్కొన్నారు.

మైండ్ బ్లోయింగ్.. నాగ చైతన్య
ఇక 'వెంకీమామ' సినిమా విషయానికొస్తే.. యూఎస్ ప్రీమియర్స్ ఆధారంగా ఫస్టాఫ్‌లో కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయని తెలిసింది. నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టారని, చివర్లో వచ్చే ఆర్మీ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో!.


Click it and Unblock the Notifications











