‘నారప్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: పవర్‌ఫుల్ లుక్‌లో దర్శనమిచ్చిన వెంకటేష్

బడా ప్రొడ్యూసర్ రామానాయుడు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు దగ్గుబాటి వారి హీరో విక్టరీ వెంకటేష్. పేరుకు సీనియర్ హీరోనే అయినా కుర్రాళ్లకు మించిన ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటారు. అందుకే మిగిలిన హీరోల కంటే వేగంగా సినిమాలు చేస్తుంటారు. అయితే, ఈ మధ్య వేగం తగ్గించిన ఆయన.. గతంతో పోలిస్తే చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' అనే సినిమా చేస్తున్నారు వెంకీ. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

తమిళంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం 'అసురన్'. దీన్ని తెలుగులో 'నారప్ప' అనే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు వెంకటేష్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్ లిమిటెట్, వీ క్రియేషన్స్‌ పతాకాలపై డీ సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మే 14న విడుదల చేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు రెండు పోస్టర్లను కూడా విడుదల చేశారు. అందులో వెంకటేష్ పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Daggubati Venkatesh Naarappa Release Date Announced

'నారప్ప'తో పాటు వెంకటేష్ 'F3' అనే సినిమాలోనూ నటిస్తున్నారు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఇక, ఈ మూవీ రిలీజ్ డేట్‌ను గురువారమే ప్రకటించారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌ అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలతో సందడి చేయనున్నారు విక్టరీ వెంకటేష్. దీంతో దగ్గుబాటి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X