twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ సడెన్ సర్‌ప్రైజ్.. అబ్బో! నారప్ప.. భలే లుక్కిచ్చావప్పా!!

    |

    ఇటీవలే 'వెంకీమామ' హిట్ సాధించి మంచి జోష్‌లో ఉన్న విక్టరీ వెంకటేష్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ చేసుకొని ఫస్ట్‌లుక్ పోస్టర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. నిజానికి వెంకీ కొత్త సినిమా గురించి చాలా రోజులుగా ఎన్నో వారతలు వస్తున్నా.. ఫస్ట్‌లుక్స్ రిలీజ్ అవుతాయని ఎవ్వరూ ఊహించలేదు. పైగా ఈ లుక్స్‌లో వెంకీ అవతారం చూసి అవాక్కవుతున్నారు జనం. పూర్తి వివరాల్లోకి పోతే..

     వైవిధ్యభరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్ వెంకటేష్

    వైవిధ్యభరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్ వెంకటేష్

    స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమను ఏలుతూ వస్తున్న వెంకటేష్.. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలను పోషించారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా అందరినీ అభిమానులుగా మార్చుకున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో అలరించే ఆయన ఇప్పుడు మరో డిఫెరెంట్ రోల్ పోషిస్తున్నారు.

    వెంకటేష్ 74వ సినిమా.. టైటిల్ ఫిక్స్

    వెంకటేష్ 74వ సినిమా.. టైటిల్ ఫిక్స్

    ఈ మేరకు వెంకటేష్ కొత్త సినిమా పేరు 'నారప్ప' అని కన్ఫర్మ్ చేస్తూ ఏకంగా నాలుగు ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్స్‌లో వెంకటేష్ గెటప్ గతంలో ఎన్నడూ చూడని విధంగా మరింత డిఫెరెంట్‌గా ఉంది. ఈ మూవీ వెంకటేష్ కెరీర్‌లో 74వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    అసురన్ తెలుగు రీమేక్

    అసురన్ తెలుగు రీమేక్

    తమిళంలో హిట్టయిన 'అసురన్' సినిమాకు తెలుగు రీమేక్ 'నారప్ప'. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ మూవీ 2019 సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించింది. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

     వెంకీ ఊరమాస్ గెటప్స్.. ఉగ్రరూపం చూపించారు

    వెంకీ ఊరమాస్ గెటప్స్.. ఉగ్రరూపం చూపించారు

    బుధవారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండటంతో టైటిల్‌ని రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. 'నారప్ప' టైటిల్ సహా వెంకీ ఊరమాస్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉగ్రరూపం దాల్చుతున్న వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేశారు.

     వెంకటేష్ సరసన ప్రియ‌మ‌ణి

    వెంకటేష్ సరసన ప్రియ‌మ‌ణి

    ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించనున్నారు. చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియ‌మ‌ణి నటించనుందని టాక్. 22 నుంచి 3వారాల పాటు ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ అనంతపురంలో పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

    English summary
    Tamil Sensational movie Asuran Will remake on telugu as NAARAPPA. In this movie Daggubati Venkatesh will act as hero. Now this movie firstlook posters released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X