వెంకీకి కలిసొచ్చిన సురేష్ బాబు కండీషన్స్.. తట్టుకోలేని తేజ చివరకు!

Recommended Video

Interesting News About Venkatesh Regarding Sita Movie || Filmibeat Telugu

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు పెట్టిన కండిషన్స్ విక్టరీ వెంకటేష్‌కి బాగా ప్లస్ అయ్యాయని తెలుస్తోంది. అన్నయ్య పెట్టిన ఆ కండిషన్స్ వెంకీని భారీ డిసాస్టర్ నుంచి బయటపడేశాయి. ఇదంతా ఊహించని వెంకీ చివరకు ఊపిరి పీల్చుకున్నాడట. ప్రస్తుతం వెంకీ గురించి ఫిలిం నగర్ లో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ ఇదే. ఇక వివరాల్లోకి వెళితే..

వెంకీ స్థానంలో బెల్లంకొండ

వెంకీ స్థానంలో బెల్లంకొండ

తాజాగా విడుదలైన సీత చిత్రంలో నిజానికి వెంకీ నటించాల్సిందని అంటున్నారు. విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలని చాలా కాలంగా భావిస్తున్న తేజ.. ఆయన కోసమే ఈ కథ సిద్ధం చేశారట. కానీ అది కాస్త వెంకటేష్ అన్న సురేష్ బాబు కారణంగా వెంకీని దాటుకొని బెల్లంకొండ శ్రీనివాస్ చేతికి చిక్కిందని సమాచారం. ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది.

తేజ చెప్పిన క‌థ వెంకీకి నచ్చినా..

తేజ చెప్పిన క‌థ వెంకీకి నచ్చినా..

డైరెక్టర్ తేజ వినిపించిన కథ వెంకటేష్ కి బాగా నచ్చిందట. కానీ ఆ కథ పై సురేష్ బాబు కొన్ని కండిషన్స్ పెట్టారని టాక్ నడుస్తోంది. సురేష్ బాబు -తేజ మ‌ధ్య చాలాసార్లు సిట్టింగులు జ‌రిగాయ‌ని, సెకండాఫ్ బాగోలేక‌పోవ‌డం వ‌ల్ల సురేష్ బాబు మార్పులూ, చేర్పులూ చేస్తూ కాల‌క్షేపం చేస్తూ వ‌చ్చాడ‌ని, అదంతా భరించలేకే తేజ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని చెప్పుకుంటున్నారు జనం. ఈ కథలోనే కొన్ని మార్పులు చేసి చివరకు సీతగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారట తేజ.

ఎలాగైతేనేం.. వెంకీ బయటపడ్డాడు

ఎలాగైతేనేం.. వెంకీ బయటపడ్డాడు

నిజానికి సీత సినిమా డిఫరెంట్ కథాంశం అని, హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని ముందునుంచే చెప్పుకొచ్చారు డైరెక్టర్ తేజ. చెప్పినట్లుగానే మోడ్రన్ సీతగా కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ తీర్చిదిద్ది భేష్ అనిపించుకున్నారు. కానీ హీరో బెల్లంకొండ క్యారెక్టర్ విషయంలోనే దెబ్బడింది. సినిమాలో హీరో క్యారెక్టర్ అస్సలు బాగా లేదనే టాక్ వచ్చింది. ఈ రకంగా చూస్తే వెంకీ ఓ డిసాస్టర్ క్యారెక్టర్ నుంచి బయటపడ్డట్టే అని చెప్పుకోవచ్చు.

మూడ్ బాలేక నేనే చేయలేదు

మూడ్ బాలేక నేనే చేయలేదు

సీత సినిమా థియేటర్స్ లోకి వచ్చి ఆవెరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన తేజ.. వెంకటేష్‌తో సినిమా ఎందుకు చేయలేదనే దానిపై స్పందించారు. వెంకీతో ప్రాజెక్టు చివరి నిమిషం దాకా వచ్చి ఆగిపోయిందని, అయితే తనకు మూడ్ బాలేక ఆ సినిమా తానే చేయలేదని తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు తేజ.

సీత మూవీ

సీత మూవీ

నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన సీత మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కాజల్ క్యారెక్టర్, ఫస్ట్ హాల్ఫ్ బాగుందని అంటున్నారు జనం.
పోటీగా ఇతర సినిమాలు ఏవీ లేకపోవడంతో మే 24న వచ్చిన ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడుతోంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటించారు. సోను సూద్ కీలక పాత్ర పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X