twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chaysam divorce: నోరు తెరిచే ముందు ఆ పని చేయండి.. సైలెంట్ గా కౌంటర్ ఇచ్చిన వెంకీ మామ

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా దాదాపు పదేళ్ల వరకు మంచి క్రేజ్ అందుకున్నటువంటి సమంత నాగచైతన్య ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట డివోర్స్ పై మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అసలు పొరపాటు ఎవరిదీ అంటూ సోషల్ మీడియాలో కూడా అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి. అయితే ముందుగానే సమంత నాగ చైతన్య వారి ప్రైవసీకి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ప్రత్యేకంగా మీడియాలో అభిమానులను కోరినప్పటికీ కూడా అదేపనిగా కొన్ని రూమర్స్ వస్తుండడంతో అక్కినేని కుటుంబ సభ్యులకు అలాగే దగ్గుబాటి వారి కుటుంబ సభ్యులు కూడా కొంత అప్సెట్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక నిరంతరం సైలెంట్ గా ఉండే వెంకటేష్ కూడా రూమర్స్ పై విభిన్నంగా స్పందించారు.

    మనం సక్సెస్ వేధికపైనే

    మనం సక్సెస్ వేధికపైనే

    టాలీవుడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నాగచైతన్య తన రెండవ సినిమా ఏ మాయ చేసావే తో మొదటి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో పరిచయమైన సమంత తోనే అతను మనం సినిమా వరకు ప్రేమను కొనసాగించాడు. ఇప్పటి వరకు కూడా వారి మధ్యలో ప్రేమ ఉందని కూడా కుటుంబ సభ్యులకు అంతగా తెలియదని నాగార్జున చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని చెప్పారు. మనం సక్సెస్ వేదికపై కూడా నాగార్జున ఓపెన్ గానే ఆ విషయాన్ని చెప్పేశారు. నాకు మంచి కోడలు దొరికింది అంటూ ఎంతగానో సంతోషించాడు కూడా.

    ఎన్ని చర్చలు జరిపినా..

    ఎన్ని చర్చలు జరిపినా..

    ఇక సమంత నాగచైతన్య విడిపోతున్నారు అనగానే ముందుగా అందరికంటే కుటుంబ సభ్యులకు ఎక్కువగా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా వారు బలమైన నిర్ణయం తీసుకోవడంతో ఇద్దరిని కలిపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. గత మూడు నెలల నుచి చర్చలు జరుగుతున్నాయి. ఒక వైపు తండ్రి నాగార్జున తో పాటు మరోవైపు నాగచైతన్య మామయ్యలు దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేష్ కూడా చాలా చర్చలు జరిపారు. కానీ ఎన్ని చర్చలు జరిపిన కూడా సక్సెస్ కాకపోవడంతో వారి సొంత నిర్ణయాలకు వదిలేశారు.

    సమంత పై పాజిటివ్ కామెంట్స్

    సమంత పై పాజిటివ్ కామెంట్స్

    వీలైనంత వరకు సమంత నాగచైతన్య నిర్ణయాలను గౌరవించాలని అది వారి వ్యక్తిగత విషయం అని పెద్దలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ముఖ్యంగా నాగార్జున కూడా కొంత భావోద్వేగంతోనే చైతు విడాకులపై స్పందించారు. అలాగే ఏప్పటికైనా సరే సమంతతో అదే తరహాలో అనుబంధము ఉంటుందని చాలా పాజిటివ్ గా కూడా తెలియజేశారు.

    Recommended Video

    Victory Venkatesh Launched Poni Poni Song From Natyam Movie
    వెంకీమామ కౌంటర్

    వెంకీమామ కౌంటర్

    ఇక నాగచైతన్య చిన్న మామయ్య దగ్గుబాటి వెంకటేష్ బహిరంగంగా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న కు రూమర్స్ పైన మాత్రం ఆయన పరోక్షంగా సెటైర్ వేసినట్లు తెలుస్తోంది. ముందుగా నోరు తెరిచి మాట్లాడే ముందు కాస్త బుర్ర అని కూడా ఓపెన్ చేయాలి అని చాలా సున్నితంగా ఇన్స్టాగ్రామ్ లో కొటేషన్ ను స్టోరీగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలపై సెటైర్ వేసినట్లే అని అనిపిస్తోంది. ప్రస్తుతం సమంత నాగచైతన్య విడాకులపై మీడియాలో అనేక రకాల కథనాలు వస్తుండటం వలన వాటికి కౌంటర్ గానే వెంకటేష్ ఈ విధంగా స్పందించినట్లు అర్థమవుతోంది.

    English summary
    Daggubati venkatesh shocking counter on naga chaitanya samantha divorce rumours,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X