Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
15ఏళ్ల వయసులో అంటే చాలా గ్రేట్.. మిస్ మ్యాచ్ ఈవెంట్లో వెంకటేష్ కామెంట్స్
ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది.
ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. సోమవారం జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు, స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దేశపతి శ్రీనివాస్, శ్రీవిష్ణు సహా ఎంటైర్ యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ నా హృదయానికి ఎంతో దగ్గరైనవారు. వారందరికీ ఆల్ ది బెస్ట్. ఉదయ్‌శంకర్ గురించి చెప్పాలంటే తన తొలి చిత్రం 'ఆటగదరా శివ'లో అద్భతుంగా నటించాడు. ఇప్పుడు 'మిస్ మ్యాచ్'లో మరో అద్భుతమైన పాత్రలో నటించాడు. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి దగ్గరైన పాత్ర ఇది. ఆయన 15ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం గొప్ప విషయం.
తను హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి. ఐశ్వర్యారాజేష్ మరో అద్భుతమైన పాత్రలో నటించింది. నిర్మాతలు భరత్, శ్రీరామ్‌కు అభినందనలు. భూపతిరాజా గారు వండర్ఫుల్ స్క్రిప్ట్‌ను అందించారని అర్థమవుతోంది. అమ్మాయిలు ఉన్నతస్థాయికి ఎదిగే స్క్రిప్ట్స్‌ను నేను బాగా ఇష్టపడతాను. డైరెక్టర్ నిర్మల్ కుమార్ టాలెంటెడ్ డైరెక్టర్. డిసెంబర్ 6న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.