మెగా వారసుడికి దగ్గుబాటి వెంకటేష్ అండ.. ఇదీ అసలు విషయం!
ఈ మధ్యకాలంలో సినిమా విడుదలకు ముందు జరిగే ప్రీ రిలీజ్ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుతూ వస్తున్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు హాజరుకావడం, ఒక హీరో సినిమాకు మరొక హీరో సపోర్ట్ ఇస్తుండటం కారణంగా ప్రతీ సినిమాకు ప్రీ రిలీజ్ వేడుక అనేది ఓ పెద్ద పండగ అవుతోంది. అంతేకాదు ఈ వేడుక సదరు సినిమాకు భారీ ప్రమోషన్ కూడా తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్ తాజా సినిమా 'వాల్మీకి' ప్రీ రిలీజ్ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలు చూద్దామా..

గద్దల కొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతోంది 'వాల్మీకి' సినిమా. ఈ సినిమాలో గద్దల కొండ గణేష్ పాత్ర పోషిస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ద్వారా ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. వరుణ్ తేజ్ స్టైల్, లుక్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Recommended Video

ప్రమోషన్స్ వేగవంతం.. పలు ఇంటర్వ్యూలు
సెప్టెంబర్ 20 వ తేదీన 'వాల్మీకి' విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ యూనిట్ అంతా బిజీ బిజీగా ఉంది. అయితే ప్రమోషన్స్‌లో అతి ముఖ్య ఘట్టమైన ప్రీ రిలీజ్ వేడుక కోసం ఓ రేంజ్ ఏర్పాట్లు చేశారు దర్శకనిర్మాతలు.

దగ్గుబాటి వెంకటేష్ అండ
తాజాగా వాల్మీకి ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తూ అఫీషియల్ సమాచారం అందించింది యూనిట్. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరగనుందని, ఈ మెగా వేడుకకు సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు.

వాల్మీకి మూవీ
తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











