Daggubati Family: విక్టరీ వెంకటేష్ ఇంట తీవ్ర విషాదం.. షూట్ క్యాన్సిల్ చేసిన స్టార్ హీరో

తెలుగు సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొగల్‌గా పేరొందిన ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినీ రంగానికి ఎన్నో సేవలు చేశారు. ఆయన తర్వాత సురేష్ బాబు, వెంకటేష్ వాళ్ల పిల్లలు కూడా ఇదే రంగంలో కొనసాగుతోన్నారు. ఇప్పటికీ తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ ఈ కుటుంబ సభ్యులు సినీ రంగంలో సత్తా చాటుతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దగ్గుబాటి ఫ్యామిలీలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఆ కుటుంబానికి చెందిన మోహన్ బాబు కన్నుమూశారు.

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ బాబాయి దగ్గుబాటి మోహన్ బాబు (73) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో పాటు వృద్దాప్యానికి సంబంధించిన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో ఆయన బాధ పడుతోన్నారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే మరోసారి ఆయన ఆరోగ్యం క్షిణించింది. దీంతో బాపట్లలోని కారంచేడులో ఉన్న ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో దగ్గుబాటి అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Daggubati Venkatesh Uncle Passes Away Due to Health Issues

దగ్గుబాటి మోహన్ బాబు మరణ వార్తను తెలుసుకున్న వెంటనే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు బాపట్లలోని కారంచేడుకు చేరుకున్నారు. రెండో కుమారుడు అభిరామ్‌తో కలిసి వెళ్లిన ఆయన బాబాయి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అయితే, విక్టరీ వెంకటేష్ మాత్రం షూటింగ్‌ కోసం ముంబైలో బిజీగా ఉండడం వల్ల వెళ్లలేకపోయినట్లు తెలిసింది. అయితే, ఈరోజు షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకున్న ఈ సీనియర్ స్టార్ హీరో.. బాబాయి చివరి చూపు కోసం కారంచేడు వెళ్తారని తెలిసింది. ఆ తర్వాత మోహన్ బాబు అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.

ఇదిలా ఉండగా.. రామానాయుడు సోదరుడిగా ప్రపంచానికి తెలిసిన మోహన్ బాబు.. 'ఒక చల్లని రాత్రి' అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా సొంత బ్యానర్‌లో పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాదు, కొన్ని పట్టణాల్లో థియేటర్లను కొనుగోలు చేసి.. వాటిని నడుపుకుంటున్నారు. ఇంతలోనే ఈ విషాదం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X