మరో మల్టీస్టారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్.. ఆ ఇద్దరి హీరోలతో పాటు..?

దగ్గుబాటి వెంకటేష్ అంటే ప్రతి ఒక్కరిలో ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కోక తప్పదు. కానీ వెంకీ మాత్రం ప్రతి ఒక్కరికి ఇష్టమనే చెప్పాలి. వెంకటేష్ సినిమా వస్తే అన్ని వర్గాల ఆడియెన్స్ ఇష్టపడతారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పైగా వెంకీ మల్టీస్టారర్ సినిమాలతో ఇప్పటికే అందరి హీరోల అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. ఇక అతని చేతిలో ఉన్న సినిమాల్లో ఎక్కువగా మల్టీస్టారర్ కథలే ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ముగ్గురి హీరోలతో..

మరో ముగ్గురి హీరోలతో..

స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా కూడా ఏ మాత్రం తేడా చూపకుండా మల్టీస్టారర్ సినిమాలను ఒకే చేసే వెంకీ ఇప్పుడు మరో ముగ్గురి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ దగ్గుబాటి హీరో తన మేనల్లుడు నాగ చైతన్యతో కూడా ఒక సినిమా చేశాడు.

 మేనల్లుడితోనే మరో సినిమా..

మేనల్లుడితోనే మరో సినిమా..

నాగచైతన్యతో చేసిన వెంకీ మామ పెద్దగా సక్సెస్ కాకపోయినా ఆ కాంబినేషన్ కి మంచి క్రేజ్ దక్కింది. ఒపెనింగ్స్ తోనే బయ్యర్లు చాలా వరకు సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. కంటెంట్ ఇంకాస్త క్లిక్కయ్యి ఉంటే సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేదని తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే వెంకీ మరోసారి నాగచైతన్యతో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సురేష్ బాబు ఒక కథను రెడీ చేయించినట్లు న్యూస్ వస్తోంది.

రానా దగ్గుబాటితో మాస్ మూవీ

రానా దగ్గుబాటితో మాస్ మూవీ

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప అనే సినిమా చేస్తున్న వెంకటేష్ వీలైనంత త్వరగా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. ఇక నారప్ప తరువాత తన అన్నయ్య కొడుకు రానా దగ్గుబాటితో కూడా ఒక మాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వస్తోంది. చాలా సార్లు ఈ కాంబినేషన్స్ పై రూమర్స్ వచ్చినప్పటికి సురేష్ ప్రొడక్షన్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Recommended Video

Naarappa Movie Intresting Update | Victory Venkatesh | Priyamani
మేగాహీరోతో కామెడీ మూవీ

మేగాహీరోతో కామెడీ మూవీ

మరోవైపు వరుణ్ తేజ్ తో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. F2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అంసుకోవడం అదే తరహాలో F3ని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటికే కథ కూడా సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ ని కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత మొదలు పెట్టాలని చూస్తున్నారు. మరి వెంకటేష్ ముందు ముందు ఇంకా ఎన్ని మల్టీస్టారర్ సినిమాలు చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X