twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముదురు భామతో వెంకటేష్ రొమాన్స్.. చాలాకాలం తర్వాత అలా కుదిరింది

    |

    దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో నటనా ప్రతిభ కనబరుస్తూ వస్తున్న విక్టరీ వెంకటేష్ ఎందరో నటీమణులతో కలిసి తెర పంచుకున్నారు. నేటికీ అగ్ర హీరోగా కొనసాగుతూ కుర్ర హీరోయిన్లతో కూడా చిందులేస్తున్నారు వెంకటేష్. అయితే కాకతాళీయంగా 28 ఏళ్ల క్రిందట వెంకటేష్‌ స్టెప్పులేసిన ఓ హీరోయిన్‌తో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం ఆయనను వరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

    1991 సంవత్సరంలో కూలీ నెంబర్ 1 సినిమాలో విక్టరీ వెంకటేష్, టబు కలిసి నటించారు. చిత్రంలో ఈ ఇద్దరి అభినయం జనాలను బాగా ఆకట్టుకుంది. ఆ చిత్రంలో ఇద్దరూ వేసిన డాన్స్, పాటలు నేటికీ యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. వెంకటేష్ తో నటించిన ఈ సినిమానే టబు కెరీర్ లో మొదటి సినిమా కూడా. ఈ సినిమా అందించిన విజయం ఆమెను టాలీవుడ్, బాలీవుడ్ తెరపై స్టార్ హీరోయిన్ గా కీర్తించబడే వరకు తీసుకెళ్లింది. అటువంటి విక్టరీ కాంబినేషన్ మరోసారి రిపీట్ చేసేందుకు పూనుకున్నారట నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.

    Daggubati Venkatesh will romance with Tabu

    ఇటీవలే అజయ్ దేవగణ్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన బాలీవుడ్ మూవీ దే దే ప్యార్ దే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో టబు చూపిన అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సురేష్ బాబు. ఈ రీమేక్ లో వెంకటేష్, టబు భార్యాభర్తలుగా నటించనున్నారనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దాదాపు 28 ఏళ్ల తర్వాత వెంకీ -టబు రొమాన్స్ మరోసారి చుడనున్నాం అన్నమాట.

    ప్రస్తుతం వెంకీ మామ సెట్స్ పై బిజీగా ఉన్నారు వెంకటేష్. ఈ చిత్రంలో అల్లుడు నాగచైతన్యతో కలిసి కామెడీ పండిస్తున్నారు వెంకీ. అతిత్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రం పూర్తికాగానే దే దే ప్యార్ దే రీమేక్ పనులు ప్రారంభం అవుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    English summary
    Daggubati Venkatesh and Naga Chaitanya playing lead roles in Venky Mama movie. When this movie finished Venkatesh will romance with Tabu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X