Don't Miss!
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Sports
ఆయన వల్లే ఫైనల్‌కు చేరాం.. నా సత్తా మొత్తం బయటికి తీసాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రవితేజ పాలిట విలన్‌గా యంగ్ హీరోయిన్: రెండు మూడు సినిమాలకే ఇలా చేస్తుందేంటి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతున్న అతడు.. గత ఏడాది 'క్రాక్' మూవీతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇలా ఇప్పటికే రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'ఖిలాడి'ని చాలా రోజుల క్రితమే మొదలు పెట్టాడు. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఫిబ్రవరి 11న విడుదల కాబోతుంది.
ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!
'ఖిలాడీ' మూవీ పట్టాలపై ఉండగానే శరత్ మందవతో రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తోన్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వరకూ పూర్తైంది. దీన్ని వచ్చే ఏడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు ఈ రెండు సినిమాల షూటింగ్‌లు చివరి దశకు చేరుకున్నాయి.

ఆ రెండు సినిమాలు మాత్రమే కాదు.. త్రినాథరావు నక్కినతో రవితేజ 'ధమాకా' అనే సినిమాను కూడా ప్రకటించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగానే రవితేజ ప్రకటించిన మరో సినిమా 'రావణాసుర'. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించబోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా జరుపుకోబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్
సుధీర్ వర్మ విలక్షణ చిత్రాలతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు. అందుకే అతడితో రవితేజ చేయబోతున్న 'రావణాసుర'పై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ దక్ష నాగర్కర్ విలన్‌గా నటిస్తుందట. ఇప్పటికే ఆమె దీనికి అంగీకారం కూడా తెలిపిందని తెలిసింది. గతంలో ఈ బ్యూటీ పలు తెలుగు చిత్రాల్లో నటించింది. ఇందులో 'హుషారు', 'జాంబి రెడ్డి' చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తక్కువ సినిమాలే చేసినా ఇప్పుడు భారీ ఆఫర్ పట్టేసింది.
విభిన్నమైన కథతో రాబోతున్న 'రావణాసుర' మూవీ ప్రీ లుక్ పోస్టర్‌కు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ విభిన్నమైన పాత్రను చేస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.