OG: పవన్ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. అన్ని భాషల్లోనూ రిజిస్టర్ చేసిన దానయ్య
రాజకీయాల కోసం సుదీర్ఘ కాలం గ్యాప్ తీసుకుని.. ఆ మొత్తాన్ని వరుస సినిమాలతో కవర్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరో.. ఇది పట్టాలపై ఉండగానే పలు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేశాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'భీమ్లా నాయక్' అనే సినిమానూ చేసి ఫ్యాన్స్‌ను అలరించాడు. అలాగే, ఇప్పుడు 'హరిహర వీరమల్లు', 'వినోదయ సీతమ్' రీమేక్ చిత్రాలను వరుసగా చేస్తున్నాడు. ఇది ఇంకా పూర్తి కాకముందే మరికొన్ని ప్రాజెక్టులను కూడా పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చాలా రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని ప్రకటించాడు. అలాగే, సురేందర్ రెడ్డితో ఓ సినిమాను కూడా చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పవర్ స్టార్.. 'సాహో' సినిమాతో చిన్న వయసులోనే పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ సుజిత్‌తో సినిమాను ప్రకటించాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, దీనికి OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమై న్యూస్ బయటకు వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి తాజాగా నిర్మాత డీవీవీ దానయ్య టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట. దీని ప్రకారం.. ఈ మూవీకి ఇప్పటికే యమ ట్రెండింగ్ అయిపోయిన OG (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) పేరునే ఖరారు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఇది కేవలం తెలుగుకే పరిమితం కావడం లేదని సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తీసుకు వచ్చేందుకు ప్లాన్లు చేస్తున్నారట. అందుకే తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో సైతం ఇదే టైటిల్‌ను దానయ్య తాజాగా రిజిస్టర్ చేయించారని ఫిలిం నగర్ వర్గాల టాక్.
ఇదిలా ఉండగా.. పవన్ హీరోగా సుజిత్ రూపొందించే సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇక, ఈ చిత్రంలో హీరోయిన్, పాటలు ఉండవని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











