ప్రభుదేవా.. లారెన్స్ తర్వాత.. దర్శకురాలిగా మారిన మరో డ్యాన్స్ మాస్టర్
ప్రభుదేవా, లారెన్స్ మాస్టార్ తర్వాత ప్రముఖ నృత్య దర్శకురాలు బృంద దర్శకురాలిగా మారింది. ఆమె తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన చిత్రం మార్చి 12వ తేదీన సెట్స్‌పైకి వెళ్లింది. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితిరావు హైదరీ కీలక పాత్రల్లో నటిస్తున్న హే సినామికా చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
సంప్రదాయ పద్దతిలో జరిగిన పూజా కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భాగ్యరాజా, మణిరత్నం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డ్యాన్స్ మాస్టర్ బృందాకు సుహాసిని, మణిరత్నం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే.

హే సినామికా సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేస్తూ.. కొత్త మ్యాజిక్ మొదలైంది. అదితిరావు, కాజల్ లాంటి లవ్లీ లేడీస్‌తో హే సినామికా మొదలైంది. బృందా మాస్టర్ గైడెన్స్‌లో ఈ సినిమా మొదలైందని చెప్పడానికి హ్యాపీగా ఉన్నాను అని ట్వీట్‌లో తెలిపారు.

జియో స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం గోవింద్ వసంత, సినిమాటోగ్రఫి ప్రీతా జయరామన్.


Click it and Unblock the Notifications











