నాకు ప్రాణహాని ఉంది.. క్యాబ్ డ్రైవర్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన ముమైత్ ఖాన్.. జరిగింది ఇదే!

రీసెంట్ గా హైదరాబాద్ కు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ముమైత్ ఖాన్ మోసం చేసిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గోవా ట్రిప్ కోసమని కార్ బుక్ చేసుకున్న ఆమె చివరికి డబ్బులు ఇవ్వకుండా చీట్ చేసిందని చెప్పడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఫైనల్ గా ఆ వివాదంపై ముమైత్ ఖాన్ వివరణ ఇచ్చింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు టార్గెట్ చేసినట్లు తెలిసింది.

ఇవ్వాల్సిన డబ్బులాన్ని పూర్తిగా చెల్లించాను..

ఇవ్వాల్సిన డబ్బులాన్ని పూర్తిగా చెల్లించాను..

మూడు రోజుల వరకు గోవా ట్రిప్ కోసం కారును బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్ ఆ తరువాత 8రోజుల వరకు కారును వదలలేదని గోవా మొత్తం తిరిగినట్లు రాజు ఆరోపించారు. అయితే అతని మాటల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పిన ముమైత్ అతను ఇవ్వాల్సిన డబ్బులాన్ని పూర్తిగా చెల్లించనాని అన్నారు. కనీసం టోల్ గేట్ డబ్బులు కూడా ఇవ్వలేదని మొత్తంగా రూ.15వేల వరకు చెల్లించాలని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు.

పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..

పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..

ఇక పంజాగుట్ట పొలీస్ స్టేషన్ కి వెళ్లిన ముమైత్ ఖాన్ క్యాప్ డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అతను కావాలనే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అదనంగా డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేశాడు. అతని నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఈ విషయంలో ముందుగానే అతని హెచ్చరించాను. పేద వాడని పెద్దగా పెట్టించుకోలేదు.

 నా గురించి అందరికి తెలుసు

నా గురించి అందరికి తెలుసు

కానీ రోజురోజుకి అతను ఆగడాలు ఎక్కువవుతున్నాయి. అందుకే పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశాను. ఇక నేను ఎలాంటి దాన్నో ఇండస్ట్రీలో అందరికి తెలుసు. దాదాపు 12 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఎవరిని కూడా మోసం చేయలేదు. పెంపుడు కుక్కను తీసుకువెళ్లాడనికి విమానంలో అనుమతి ఉండదు కాబట్టే క్యాబ్ లో వెళ్లాల్సి వచ్చింది.. అని ముమైత్ ఖాన్ వివరణ ఇచ్చింది.

Recommended Video

RDX Love Trailer | పాయల్ రాజ్‌పుత్ కేక
 బిజీగా కనిపించని ముమైత్ ఖాన్

బిజీగా కనిపించని ముమైత్ ఖాన్

ఇక 2004లో స్వామి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ ఆ తరువాత ఛత్రపతి, పోకిరి వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. ఇక కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించింది. ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ లలో కనిపించేది. కానీ ముమైత్ గతంలో మాదిరిగా బిజీగా కనిపించడం లేదు. ఇక చాలా రోజుల తరువాత ముమైత్ పేరు ఇలా ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X