twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దండుపాళ్యం 4 వివాదం ఇదే: సెన్సార్ బోర్డుకు షాకిచ్చిన నిర్మాత

    |

    బెనర్జీ, వెంకట్‌, ముమైతఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన 'దండుపాళ్యం 4' చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    దండుపాళ్యంతో సంబంధం లేదు

    దండుపాళ్యంతో సంబంధం లేదు

    దండుపాళ్యం 4 చిత్రానికి 'దండుపాళ్యం' ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. 'దండుపాళ్యం-4'లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ 'దండుపాళ్యం 4' రూపొందింది. ఇందులో ఏడుగురి గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు అని నిర్మాత వెంకట్ వెల్లడించారు.

    సెన్సార్ అభ్యంతరాలపై నిర్మాత ఆవేదన

    సెన్సార్ అభ్యంతరాలపై నిర్మాత ఆవేదన

    నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్‌, నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇటీవల సెన్సార్‌‌కు అప్లై చేశాను. కంటెంట్‌ పరంగా సినిమాలో ఏదన్నా సమస్య ఉంటే ఆ సన్నివేశాన్ని, డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది. నా సినిమా చూసిన సెన్సార్‌ బోర్డ్‌ ఆఫీసర్‌ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి.. లేదంటే రిజక్ట్‌ చేస్తానని చెప్పారు.

    సమస్య ఏంటో చెప్పకుండా

    సమస్య ఏంటో చెప్పకుండా

    సినిమాలో సమస్య ఏంటో చెప్పకుండా సినిమాను రిజెక్ట్‌ చేస్తాననడం మొదటిసారి చూశా. ఆ తర్వాత నేనీ సినిమా సెన్సార్‌ చెయ్యను. రివైజ్‌ కమిటీకి వెళ్లండన్నాడు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నా. రివైజ్‌ కమిటీనే కాదు.. ట్రిబ్యునల్ అదీ కాకపోతే.. కోర్టు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో సినిమా విడుదల చేస్తాం'' అనని తెలిపారు. ‘‘ఇంతకన్నా క్రైమ్‌ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని విజయవంతంగా ఆడి థియేటర్స్‌ నుంచి కూడా వెళ్లిపోయాయి.

    సెన్సార్ బోర్డుతో ఇబ్బంది

    సెన్సార్ బోర్డుతో ఇబ్బంది

    మా సినిమాతో సెన్సార్‌ బోర్డ్‌కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చిలో సినిమా విడదల చేస్తాం'' అని దర్శకుడు చెప్పారు. కన్నడలో దండుపాళ్యంలో నటించడం వల్ల అక్కడ మరో రెండు సినిమాల్లో అవకశం వచ్చిందని డి.ఎస్‌.రావు చెప్పారు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: బెనర్జీ , వెంకట్, సుమన్ రంగనాథన్, ముమైత్ ఖాన్, సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్, డిఎస్ రావు, , రాక్ లైన్ సుధాకర్ బులెట్ సోము, విఠల్ రంగయన్, జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్ , స్నేహ , రిచర్డ్ శాస్త్రి తదితరులు.
    డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి
    మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ
    లిరిసిస్ట్ : భువనచంద్ర
    డి ఓ పి: .గిరి బెనకరాజు
    కోరియోగ్రఫీ : బాబా భాస్కర్
    ఎడిటర్ : బాబు ఏ శ్రీవాత్సవ - ప్రీతి మోహన్
    పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు
    బ్యానర్ వెంకట్ మూవీస్
    నిర్మాత: వెంకట్
    దర్శకత్వం: కె.టి.నాయక్

    English summary
    "Dandupalyam 4" Film is releasing in telugu with the same title, The film stars Banerji, Venkat, Mummaith Khan, Sanjeev Kumar, Suman Ranganathan, Directed by K. T. Nayak & Produced by Venkat. Dandupalyam shooting has been completed and the producers are looking for March Release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X