Pooja Gandhi 40 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కిన బోల్డ్ హీరోయిన్... భాష నేర్పించిన వ్యక్తితోనే ప్రేమవివాహం!
40 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కింది దండు పాల్యం హీరోయిన్. ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ భామ తన 40 ఏళ్ల వయసులో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ ఘోర్పడేతో పెళ్లి పీటలు ఎక్కింది. వీరు ఇద్దరు కలిసి వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పూజా గాంధీ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రముఖ కన్నడ నటి.. దండు పాళ్యం హీరోయిన్ పూజా గాంధీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ దండు పాల్యం సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇప్పుడు ఈ భామ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ ఘోర్పడేను పెళ్లి చేసుకుంది. వీరు ఇరువురు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం (నవంబర్ 29)న యలహంకలో వీరి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

పూజా గాంధీ, విజయ్ ఘోర్పడే పెళ్లికి కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వేడుకకు హాజరు అయ్యి వీరిని ఆశీర్వదించారు. నూతన దంపతులను దగ్గరుండి ఆశీర్వదించి.. సందడి చేశారు. ఇక పూజా గాంధీని కన్నడ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన యోగరాజ్ భట్, నటి సుధారాణి, బుజ్జి గాడు ఫేమ్ సంజనా గల్రానీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
హీరోయిన్ పూజా గాంధీ స్వస్థలం ఉత్తరప్రదేశ్ కాగా.... 'ముంగారు పర్మ్' సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కైవసం చేసుకుంది. పూజా గాంధీ రాజకీయ రంగంలో కూడా పాపులర్ అయింది. పూజా గాంధీకి విజయే స్వయంగా కన్నడ నేర్పించాడని సమాచారం. అలా భాష నేర్పించే క్రమంలో ఈ భామ.. ప్రేమలో పడింది. ఇక ఇద్దరు కొన్నాళ్లు ప్రేమలో మునిగిపోయారు. ఇక ఈ క్రమంలో వైవాహిక బంధఃతో ఒక్కటై.. ఏడు అడుగులు వేశారు.

అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే... 2012లోనే పూజా గాంధీకి వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయింది. వ్యాపారవేత్త ఆనంద్ గౌడతో ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరగ్గా... ఏమైందో తెలియదు.. కొన్ని రోజులకే వారిద్దరూ విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఈ భామ ఒంటిరగానే ఉండిపోయింది. ఇప్పుడు మళ్లీ 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని ఆశ్చర్య పరించింది.

పూజా గాంధీ విజయ్ తో కలిసి పెళ్లిపీటలెక్కడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో ఈ భామ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఒక్క కన్నడంలోనే కాదు.. తెలుగు, తమిళ, బెంగాళీ, హిందీ, సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక దండుపాళ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇందులో బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది పూజా. ఈ విషంయ తెలుసుకున్న అభిమానులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











