దంగల్ ఫేమ్ యాక్టర్ కన్నుమూత.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. మృతికి కారణం ఏమిటంటే!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకొన్నది. సెంథిల్ కుమార్ సతీమణి రూహీ మరణం నుంచి కోలుకోకముందే మరో వర్తమాన తార నింగికెగిసింది. మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ రూపొందించిన దంగల్ సినిమాలో బబితా పోగట్ పాత్రలో నటించిన బాలనటి ఇక లేరు. ఆనారోగ్యంతో బాధపడుతూ శనివారం (17 ఫిబ్రవరి) రోజున తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆమె మరణానికి సినీ ప్రముఖులు సంతాపం తెలిజచేస్తున్నారు. ఆమె మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సుహాని భట్నాగర్ జనవరి 14వ తేదీ 2004 సంవత్సరంలో హర్యానాలోని ఫరీదాబాద్‌లో జన్మించింది. ఆమె వయసు 19 సంవత్సరాలు. ఫరీదాబాద్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూలో చదువుకొన్నారు. తన 12వ ఏట ఈ చిన్నారి అమీర్ ఖాన్, ఫాతీమా సనా షేక్, సన్యా మల్హోత్రా నటించిన దంగల్ సినిమ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.

Dangal Fam Suhani Bhatnagar

నితిన్ తివారీ దర్శకత్వం వహించిన దంగల్ సినిమాలో బబితా ఫోగట్‌ చిన్నప్పటి పాత్రలో సుహాని భట్నాగర్ నటించింది. ఆమె పాత్రకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.

ఇక సుహాని భట్నాగర్ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దికాలంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆమె పరిస్థితి విషమించింది. ఆమెను బతికించడానికి డాక్టర్లు చేసి విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Recommended Video

Dangal Fame Suhani Bhatnagar ఆకస్మిక మరణం.. చిన్న వయసులోనే ఇలా..? | Filmibeat Telugu

ప్రమాదవశాత్తూ సుహాని భట్నాగర్ కాలు ఇటీవల విరిగింది. ఆ క్రమంలో తీసుకొన్న మందులు వల్ల మెడికల్ రియాక్షన్ కావడంతో హాస్పిటల్‌లో చేర్చారు. దానికి ఆమె చికిత్స పొందుతున్నది. శరీర కణాల్లో ఫ్లూయిడ్స్ అతిగా చేరడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింది. అలాంటి సమస్యతో పోరాడుతూ ఆమె మరణించారు అని వైద్యులు పేర్కొన్నారు.

సుహాని భట్నాగర్ భౌతికకాయాన్ని ఫరీదాబాద్‌లో సెక్టర్ 15లోని అజ్రోండా శ్మశాన వాటికకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె అంత్యక్రియలు అక్కడే జరుగుతాయని బంధువలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X