Dhanush ఐశ్వర్య విడాకుల వ్యవహారంలో కొత్త మలుపు.. రజనీ, ధనుష్ తండ్రి ఎంట్రీ

తమిళ చిత్ర పరిశ్రమలో మంచి టాలెంటెడ్ నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా గాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ధనుష్ ఇటీవల పర్సనల్ ఫ్యామిలీ రిజన్స్ తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పందించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు అందరు ఒక్కసారిగా షాకయ్యారు. అయితే వారు మళ్లీ కలిసే అవకాశం లేదని కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

ఇక రీసెంట్ గా ధనుష్ తండ్రి కస్తూరి రాజా మీడియాకు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ వారు ఇద్దరూ కలిసే అవకాశం ఉన్నట్లుగా క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ తో కూడా ఈ విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

వారి తరహాలోనే..

వారి తరహాలోనే..

ఇటీవల కాలంలో చిత్రపరిశ్రమలో చాలామంది సెలబ్రిటీలు వారి దాంపత్య జీవితానికి ముగింపు కార్డు వేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య కూడా విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య రాజేష్ కూడా వ్యక్తిగత విభేదాలు రావడంతో వారి దాంపత్య జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

అదృష్టం అని అనుకున్నారు

అదృష్టం అని అనుకున్నారు

రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య 2004 ధనుష్ ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పాతికేళ్ళ వయసులో పై వీరిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. ఇక ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు పొందుతున్నారు. రజనీకాంత్ అల్లుడు కావడం ధనుష్ అదృష్టమని కూడా అందరూ అనుకున్నారు. కానీ ధనుష్ తన టాలెంట్ తోనే పైకి వచ్చాడు అని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ఇక రజినీకాంత్ అవసరం కూడా ఇప్పుడు లేదు అని అతనికి దేశవ్యాప్తంగా వివిధ ఇండస్ట్రీలల నుంచి ఆఫర్లు వస్తున్నాయని కథనాలు వెలువడుతున్నాయి.

హఠాత్తుగా..

హఠాత్తుగా..

ధనుష్ తన భార్య ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకోవడం పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మొన్నటి వరకు బాగానే ఉన్నా ఈ జంట హఠాత్తుగా ఎందుకు విడాకులుకు సిద్ధమయ్యారు అనే విషయంలో ఎక్కువగా పాత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్లనే ఇద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోతున్నట్లు పలు మీడియాలలో వార్తలు వస్తున్నాయి.

స్పందించిన ధనుష్ తండ్రి

స్పందించిన ధనుష్ తండ్రి

ఇక ఇటీవల ధనుష్ తండ్రి కస్తూరి రాజా మీడియాతో మాట్లాడుతూ వారిద్దరూ కూడా మళ్లీ కలిసే అవకాశం ఉన్నట్లుగా వివరణ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా అభిమానులు వారి శ్రేయోభిలాషులు కూడా ఇద్దరూ మళ్లీ కలిసి ఉంటే చాలా బాగుంటుంది అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం కాదు అని కూడా వారు చెబుతున్నారు.

ఇద్దరితో మాట్లాడడం జరిగింది

ఇద్దరితో మాట్లాడడం జరిగింది

ఇక మీడియాతో మాట్లాడుతూ కస్తూరి రాజా ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. దాంపత్య జీవితంలో గొడవలు జరగడం సర్వ సాధారణం. అలాంటి గొడవలే ధనుష్, ఐశ్వర్య మధ్య చోటు చేసుకున్నాయి. ఇప్పుడైతే వారు చెన్నైలో లేరు. హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఫోన్‌లో కూడా ఇద్దరితో మాట్లాడడం జరిగింది. వీలైనంత వరకు సలహాలు, సూచనలు కూడా అందించాను అని అన్నారు.

రజనీకాంత్ కూడా..

రజనీకాంత్ కూడా..

ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఈ విషయంలో రజనీకాంత్ తో కూడా మాట్లాడడం జరిగిందని అన్నారు. రజనీకాంత్ కూడా ధనుష్, ఐశ్వర్యలకు విడాకుల నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని తెలియజేశారు. పిల్లల భవిష్యత్తు రీత్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బావుంటుందని కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలెబ్రిటీలు కోరుతున్నారు.. అని ధనుష్ తండ్రి కస్తూరి రాజా తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X