For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దర్బార్' ఫస్ట్‌టాక్: ఆడియన్స్ ఏమంటున్నారంటే..

    |

    సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'దర్బార్'. రజనీకాంత్, నయనతార, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు (జనవరి 9) ఘనంగా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 వేల ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌టాక్ ఎలా ఉందో, ప్రేక్షకులు ఏమంటున్నారో ఓ లుక్కేద్దామా..

    రజినీకాంత్ ఎంట్రీ.. పోలీస్ ఆఫీసర్‌

    రజినీకాంత్ ఎంట్రీ.. పోలీస్ ఆఫీసర్‌

    తమిళనాట దర్బార్ సినిమా చూసి రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అక్కడ పొంగల్‌కు పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో రజనీ బ్లాక్‌బస్టర్ ఖాయం అంటున్నారు. సినిమాలో రజిని ఎంట్రీ అదిరిందని, పోలీస్ ఆఫీసర్‌గా సూపర్ స్టార్ ఇరగదీశారని టాక్ నడుస్తోంది.

    ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్.. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్

    ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్.. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్

    ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్, కీలక యాక్షన్ సీన్స్ ఎంతో ఆకట్టుకున్నాయని అంటున్నారు జనం. దీంతో పాటు పాటు ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ ఇచ్చిందని, ఇది సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని పెంచిందని చెబుతున్నారు. యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ బాగా షూట్ చేశారని అంటున్నారు.

    ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్.. స్పెషల్ ట్రీట్

    ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్.. స్పెషల్ ట్రీట్

    ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందని అంటున్నారు జనం. మంచి యాక్షన్ కథాంశంతో కూడిన సినిమాలు కోరుకునే వారితో పాటు రజినీకాంత్ అభిమానులకు ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇస్తుందని టాక్ నడుస్తోంది.

    తెలిసిన కథే.. మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్

    తెలిసిన కథే.. మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్

    మొత్తానికి తెలిసిన కథే అయినా కూడా మురుగుదాస్ అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించారని అంటున్నారు. దీంతో ఈ సినిమా రేంజ్ అమాంతం పెరిగిందని చెబుతున్నారు. బ్యాడ్ పోలీస్ ఆఫీసర్‌గా రజినీకాంత్ నటన మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేసిందని టాక్ బయటకొస్తోంది.

    దర్బార్ సినిమా.. ఆ లోటు తీరే అవకాశం

    దర్బార్ సినిమా.. ఆ లోటు తీరే అవకాశం

    గత కొన్నేళ్లుగా రజినీ రేంజ్ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ఫ్యాన్స్‌కి దర్బార్ సినిమాతో ఆ లోటు తీరే అవకాశం ఉందని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించడం ఖాయం అనే టాక్ నడుస్తోంది.

    English summary
    Super star Rajinikanth and Nayanatra playing lead roles on Darbar movie. This movie released today and getting first talk as fallows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X