twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్బార్: ఆ ట్వీట్ చూసి చెలరేగిపోయిన రజనీకాంత్ ఫ్యాన్స్!

    |

    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దర్బార్'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ట్విట్టర్ ద్వారా రజనీకి సంబంధించిన రెండు పోస్టర్స్ షేర్ చేశారు.

    వీటిని షేర్ చేసిన మురగదాస్... 'ఇక మీ క్రియేటివిటీ చూపించండి ' అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో ఒకదాంట్లో సూపర్ స్టార్ పోలీస్ అవతారంలో, మరొకదాంట్లో స్టైలిష్ లుక్‌తో ఉండటం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తమ క్రియేటివిటీ ఉపయోగించి ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో అదరగొట్టారు.

    DARBAR movie new posters goes viral

    రజనీకాంత్ చివరగా 1992లో వచ్చిన 'పాండ్యన్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. మళ్లీ 27 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    దర్బార్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ తమిళ కమెడియన్ యోగిబాబు కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ మూవీని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

    English summary
    DARBAR movie new posters goes viral. Darbar is an upcoming Indian Tamil-language action thriller film written and directed by AR Murugadoss and produced by Allirajah Subaskaran under the banner of Lyca Productions. The film stars Rajinikanth and Nayanthara in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X